Asianet News TeluguAsianet News Telugu

‘ముస్లింల బ్యూటీ పార్లర్ల‌కు, మెహందీ కేంద్రాలకు వెళ్లొద్దు’

కర్వా చౌత్( హిందూ పండుగ) నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ముజఫర్‌నగర్‌లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో హిందూ మహిళలుజ‌జ  ముస్లింల పార్లర్ల‌కు, మెహందీ సెంటర్లను వెళ్ల‌కూడ‌ద‌ని హిందూ సంస్థలు నిషేధం విధించాయి. జఫర్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే కూడా మహిళలకు ఇదే విజ్ఞప్తి చేశారు. ఈ విష‌యానికి  లవ్ జిహాద్‌తో కూడా ముడిపెట్టారు.

BJP MLA threatens Muslim mehendi artists
Author
First Published Oct 13, 2022, 1:00 PM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌రో వివాదం తెర మీదికి వ‌చ్చింది. కర్వా చౌత్( హిందూ పండుగ) నేప‌థ్యంలో   ముజఫర్‌నగర్‌లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో హిందూ మహిళలు.. ముస్లింల పార్లర్ల‌కు, మెహందీ సెంటర్లను వెళ్ల‌కూడ‌ద‌ని హిందూ సంస్థలు నిషేధం విధించాయి. ఆ సంస్థ‌ల కార్య‌క‌ర్త‌లు పార్లర్లు,మెహందీ సెంటర్లు తిరుగుతూ మెహందీ వేసే వారి ఐడీలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో హిందూ మహిళల సౌకర్యార్థం నగరవ్యాప్తంగా 13 మెహందీ కేంద్రాలను కూడా ప్రారంభించారు.

కర్వా చౌత్ సందర్భంగా ముస్లింల కు సంబంధించిన‌ పార్లర్‌లు, మెహందీ కేంద్రాలకు వెళ్లవద్దని హిందూ సంస్థలు హిందూ మహిళలను కోరుతున్నారు. కేవ‌లం హిందూవులు న‌డుపుతున్న‌ పార్లర్లు, మెహందీ సెంటర్ల‌లో  మెహందీ వేసుకోవాల‌ని కోరుతున్నారు. ముస్లిం(మ‌గ‌) కళాకారులు హిందూ మహిళల చేతులపై గోరింటాకు వేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హిందూ మహాసభ సభ్యులు హెచ్చరించారు.

బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ విజ్ఞప్తి  

ముస్లిం యువకులు.. హిందూ యువ‌త‌ల‌కు మెహందీ వేయ‌డంతో వేరే ఉద్దేశంతో ఉందని ఖతౌలీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం యువ‌కుల‌ మదిలో లవ్ జిహాద్ ఆలోచ‌న ఉంద‌ని అన్నారు. వారు మెహందీ  ముసుగులో లవ్ జిహాద్ చేస్తారనీ, ఈ త‌ర‌హా అనేక కేసులు తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. బ్యూటీ పార్లర్‌కు వెళ్లే మహిళలందరూ హిందువులు నిర్వహించే పార్లర్‌కే వెళ్లాలని, హిందూ కళాకారులతోనే మెహందీ వేయాలని  హిందూ మ‌హిళ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇంట్లోనే మెహందీ పెట్టుకోవాలని చెప్పారు. ముస్లింలు నిర్వహిస్తున్న పార్లర్లు లవ్ జిహాద్ కోసమే ఏర్పాటు చేశార‌ని ఎమ్మెల్యే అన్నారు. అమాయ‌క హిందూ యువ‌త‌ల‌ను వారు టార్గెట్ చేస్తున్నార‌ని అన్నారు.  

మెహందీ స్టాళ్ల ఏర్పాటు.. 

ఈ నేప‌ధ్యంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) 13 మెహందీ స్టాల్స్‌ను ప్రారంభించింది. ముస్లిం (మ‌గ)  మేకప్ ఆర్టిస్టులు హిందూ మహిళల చేతికి గోరింట వేయకుండా ఈ స్టాళ్ల‌ను ఏర్పాటు చేశారు. మెహందీ కళాకారుల ఆధార్ కార్డులను తనిఖీ చేయడం ద్వారా వారి వివరాలను ధృవీకరిస్తున్నారు. 

లవ్ జిహాద్ బారిన పడకుండా..హిందూ సోద‌రిమ‌ణుల‌ను( అక్కాచెల్లెలు) కాపాడేందుకే ఈ చర్య అని హిందూ మహాసభ సభ్యుడు లోకేష్ అన్నారు. కర్వా చౌత్ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న హిందూ మహిళలు స్టాల్ యజమానులను సంప్రదించాలని ఆయన అన్నారు. 2021లో ముజఫర్‌నగర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హిందూ క్లయింట్‌కు ముస్లింలు ఎవరూ గోరింటాకు వేయకూడదని హెచ్చ‌రించ‌డంతో ఓ హిందూ మ‌త సంస్థ పై  ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios