బెంగళూరు : కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మరో 24 గంటల్లో కుప్పకూలుతుందని బీజేపీ సీనియర్ నేత ఉమేశ్ కత్తి జోస్యం చెప్పారు. బుధవారం మీడియాతో  మాట్లాడిన ఉమేశ్ కత్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

24 గంటల్లో ఆ 15 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారని బీజేపీకి మద్దతు ఇస్తారని చెప్పారు. వచ్చేవారం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమేశ్ కత్తి గతంలో మంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 
 
మరోవైపు కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుమార స్వామి ప్రభుత్వాన్ని కూల్చడంపై తమకు ఆసక్తి లేదన్నారు. తమని ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు బాధ్యత అప్పగించారని అక్కడే కొనసాగుతామని తెలిపారు.