ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. ప్రచారంలో ప్రత్యర్ధులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధి ఓడిన అభ్యర్ధి ఇంటికి వెళితే.. అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది.

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌ను.. బీజేపీ యువనేత మనోజ్ తివారీ ఓడించారు. ఈ క్రమంలో శనివారం మనోజ్.. షీలా దీక్షిత్‌ ఇంటికెళ్లి ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం షీలా ఆరోగ్యం గురించి వాకబు చేసి, కుశల ప్రశ్నలు వేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి మనోజ్, షీలా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 7,87,799 ఓట్లు రాగా... షీలా దీక్షిత్‌కు 4,21,697 ఓట్లు పోలయ్యాయి. దీంతో మనోజ్ తివారీ 3.6 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.