దేశ రాజధాని ఢిల్లీలో 7 సీట్లలోనూ భారత జనతా పార్టీ దూసుకెళ్తోంది. త్రిముఖపోరు జరుగుతున్న ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ 2,3 స్థానాల కోసం తమలో తాము పోటీపడుతున్నాయి. న్యూ ఢిల్లీలో మీనాక్షి లేఖి అజయ్ మాకెన్ కన్నా ముందంజలో ఉన్నారు. గాయకుడూ హన్స్ రాజ్ వాయువ్య ఢిల్లీలో లీడింగ్ లో ఉన్నాడు. 

క్రికెటర్ గౌతమ్ గంబీర్ తూర్పు ఢిల్లీ స్థానంలో దూసుకుపోతుండగా ఆప్ అభ్యర్థి అతిషి మర్లినా వెనుకంజలో ఉన్నారు. మరో సెలబ్రెటీ బాక్సర్ విజేందర్ సింగ్ సైతం దక్షిణ ఢిల్లీలో వెనుకంజలో ఉన్నారు. మూడు పార్టీల ఢిల్లీ అధ్యక్షులు మనోజ్ తివారి భాజపా, షీలా దీక్షిత్ కాంగ్రెస్, దిలీప్ పాండే ఆప్ మధ్య పోటీ పెరిగింది. ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారి ముందంజలో ఉన్నారు. 

చాందిని చౌక్ నుంచి భాజపా తరపున మంత్రి హర్షవర్ధన్ లీడింగ్ లో ఉన్నారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపికి మనోజ్ తివారి, హర్షవర్ధన్ ల రూపంలో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్దులయితే రెడీ అయినట్టే కనపడుతున్నారు.