Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయి: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయని  బీజేపీ ఆరోపించింది.  రాష్ట్రంలో చోటు  చేసుకున్న ఘటనలను ఆ పార్టీ ప్రస్తావించింది.

BJP attacks state govt over rising crime lns
Author
First Published Jul 19, 2023, 6:10 PM IST

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ విమర్శించారు.
రాజస్థాన్ లో జరుగుతున్న వరుస ఘటనలను  ఆయన ఈ వ్యాఖ్యలు  చేశారు.  జోధ్ పూర్ హత్యల తర్వాత  తాజాగా  మంత్రి బంధువు  హోటల్ లో దాడులకు దిగడాన్ని  జైహింద్ ప్రస్తావించారు. ఈ మేరకు  ట్విట్టర్ లో ఓ వీడియోను కూడ ఆయన షేర్ చేశారు.

మంత్రి మేనల్లుడు  గూండాలతో  హోటల్ పై దాడి చేసి  హింసకు పాల్పడ్డాడని  ఆయన గుర్తు  చేశారు.  ఈ ఘటనపై  ఎలాంటి చర్యలు తీసుకోలేదని  జైహింద్ విమర్శించారు. మరో వైపు రాజస్థాన్ సీఎం గెహ్లాట్   నిందితులను రక్షించే ప్రయత్నం  చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.

 

ఇదిలా ఉంటే  ఈ ఏడాది జూన్ మాసంలో  దళిత బాలిక  కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే ఇటీవలనే  దళిత యువతిపై యాసిడ్ పోసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను  బావిలో వేశారు.ఈ ఘటనలపై  బీజేపీ  మండిపడింది.  రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయని  బీజేపీ విమర్శలు చేసింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios