Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ.. తెలంగాణకు మళ్లీ ఆయనే

బీజేపీ అధినాయకత్వం శుక్రవారం పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కమలనాథులు. 

bjp appointed party new incharges for some states
Author
First Published Sep 9, 2022, 9:35 PM IST

బీజేపీ అధినాయకత్వం శుక్రవారం పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ ఇన్‌ఛార్జీల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కమలనాథులు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. 

కొత్త ఇన్‌ఛార్జీలు, సహ ఇన్‌ఛార్జీలు వీరే:

1. తెలంగాణ- తరుణ్ చుగ్, అరవింద్ మీనన్
2. బీహార్- వినోద్ తవాడే, హరీశ్ ద్వివేది
3. చత్తీస్‌గఢ్- ఓం మాధుర్, నితిన్ నబీన్
4. డయ్యూడామన్ , దాద్రానగర్ హవేలీ- వినోద్ సోంకర్
5. హర్యానా- బిప్లబ్ కుమార్ దేబ్
6. కేరళ- ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
7. లక్షద్వీప్- డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
8. మధ్యప్రదేశ్- పి.మురళీధర్ రావు, పంకజా ముండే, డాక్టర్ రామ్ శంకర్ కథేరియా
9. జార్ఖండ్- లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్
10. పంజాబ్- విజయ్ భాయ్ రూపానీ, డాక్టర్ నరీందర్ సింగ్ రైనా
11. ఛండీగఢ్- విజయ్ భాయ్ రూపానీ
12. రాజస్థాన్- అరుణ్ సింగ్, విజయ రహత్కార్
13. త్రిపుర- డాక్టర్ మహేశ్ శర్మ
14. పశ్చిమ బెంగాల్- మంగళ్ పాండే, అమిత్ మాలవ్యా, సుశ్రీ ఆశా లక్రా
15. ఈశాన్య భారతం- డాక్టర్ సంబిత్ పాత్రా (కో ఆర్డినేటర్ ), రుతురాజ్ సిన్హా (జాయింట్ కో ఆర్డినేటర్)
 

Follow Us:
Download App:
  • android
  • ios