Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: యూపీ ఎన్నికలు.. బీజేపీకి తప్పని తిప్పలు.. !

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ప‌రిణామాలు ఊహించ‌ని విధంగా వేగంగా మారిపోతున్నాయి. మ‌రీ ముఖ్యంగా వ‌రుస‌గా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాల‌నుకుంటున్న బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. వ‌రుస పెట్టి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌లు పార్టీని విడుతుండ‌టంతో నీట మునుగుతున్న ప‌డ‌వ‌ల మారుతున్న‌ది బీజేపీ ప‌రిస్థితి.. ! 
 

bjp a drowning ship in uttar pradesh
Author
Hyderabad, First Published Jan 15, 2022, 10:53 AM IST

UP Assembly Election 2022: దేశ రాజ‌కీయాలు ఎక్క‌వ మొత్తంలో ప్ర‌భావితం చేయ‌గ‌ల రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌. అందుకే యూపీ ఎన్నిక‌ల‌ను (UP Assembly Election) అన్ని ప్ర‌ధాన పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటాయి.  ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈసీ షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత అన్ని పార్టీలు అధికారం పీఠం ద‌క్కించుకోవ‌డానికి ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తూ.. ఎన్నిక‌ల ప్ర‌చారం హోరును కోన‌సాగిస్తున్నాయి. అయితే, ప్ర‌స్తుతం గ‌మ‌నిస్తే.. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఊహించ‌ని విధంగా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్ర‌క‌టించ‌క ముందు రాష్ట్రంలో మ‌ళ్లీ బీజేపీనే అధికారం చేప‌డ‌తుంద‌ని ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి. రాజ‌కీయాల వ‌ర్గాల్లోనూ ఇదే విధ‌మైన చ‌ర్చ సాగింది. అయితే, రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం అనే నానుడిని నిజం చేస్తూ.. ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత క‌మ‌లం వాడిపోతున్న ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీని వీడుతున్న మంత్రులు, ముఖ్య నేత‌ల కార‌ణంగా బీజేపీ ప‌రిస్థితి నీటిలో చిల్లు ప‌డ్డ ప‌డ‌వ మాదిరిగా మారింది. 

ఎందుకంటే.. ప్ర‌స్తుతం బీజేపీ వీడుతున్న మంత్రులు, నేత‌లు, ఎమ్మెల్యేల‌లో ఎక్కువ మంది ఓబీసీ నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే, పార్టీని వీడుతున్న నేత‌లు ఆయా సామాజిక వ‌ర్గాలో బ‌ల‌మైన నేత‌లు. ఇప్పటివ‌ర‌కు బీజేపీని వీడిని మంత్రులు, నేత‌లు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగే వారు కావ‌డంతో క‌ల‌మంలో అల‌జ‌డి మొద‌లైంది. బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న నేత‌లు ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ తీరును త‌ప్పుబ‌ట్ట‌డంతో పాటు అగ్ర‌కులాల వారికి త‌ప్ప ఇత‌ర వ‌ర్గాల వారికి బీజేపీలో స‌రైన గుర్తింపు... ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శించడం ఆ పార్టీని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసింది. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇంకా క‌మలాన్ని వీడేవారి సంఖ్య పెద్దగానే ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తున్న‌ది. మొత్తం మీద  10-12 మంది మంత్రులు, 40-50 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గుడ్ బై చెప్ప‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదివ‌ర‌కు ఎన్నిక‌ల్లో మూడు వంద‌ల‌కు పైగా సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ లెక్క పెద్ద‌గా అనిపించ‌క‌పోయిన... పార్టీని వీడిన నేత‌ల్లో ఒక్కొక్క‌రు అనేక స్థానాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగే వారు ఉన్నారు. అంటే ఎన్నిక‌ల్లో (UP Assembly Election) బీజేపీకి గ‌ట్టి దెబ్బ‌త‌గ‌ల నుంద‌ని ప్ర‌స్తుత పరిణామాలు చేస్తుంటే తెలుస్తున్న‌ది. 

ఇటీవ‌ల బీజేపీని వీడిన స్వామి ప్రసాద్‌ మౌర్య ఆ పార్టీలో కీల‌క నేత‌. ఓబీసీ వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల బ‌ల‌మైన నాయ‌కుడు. ఆయ‌న ప‌దుల సంఖ్య‌లో నియోగ‌జ‌క వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లరు. మౌర్య బీజేపీని వీడ‌టంతో పెద్ద మొత్తం న‌ష్టం జ‌రిగింద‌నే వాస్త‌వం.  కుషీనగర్‌, ప్రతాప్‌గఢ్‌, కాన్పూర్‌ దేహట్‌, బందా, షాజహాన్‌పూర్‌ జిల్లాల్లోని కనీసం 20 నియోజవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల బ‌ల‌మైన ఓబీసీ నేత స్వామి ప్ర‌సాద్ మౌర్య‌. అలాగే, బీజేపీకి గుడ్ బై చెప్పిన మ‌రో నేత‌ ధ‌ర‌మ్ సింగ్. ఈయ‌న కూడా ఓబీసీ వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నేత. రాజ‌కీయంగా చౌహాన్‌ కులంలో మంచి పట్టున్న నాయ‌కుడు. ధ‌రం సింగ్ చౌహాన్ దాదాపు  పది నియోజ‌క వ‌ర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరు.  బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రో మంత్రి ధ‌ర‌మ్ సింగ్ సైనీ. ఆయ‌న కూడా ఓబీసీ వ‌ర్గానికి చెందిన నేత‌. ఆయా వ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. రాజ‌కీయంగా సర్సావా, నాకూర్‌ ప్రాంతాల్లో మంచి పట్టున్న నేత. ఓబీసీ నేత‌లే కాకుండా ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు సైతం బీజేపీ వీడుతున్నారు. టెరాయ్ ప్రాంతంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న బ్ర‌హ్మ‌ణ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు బాల అవ‌స్థి. ఆయ‌న బీజేపీకీ గుడ్ బై చెప్ప‌డంతో క‌మ‌లానికి భారీ న‌ష్ట‌మే జ‌రిగింద‌ని చెప్పాలి. ఎందుకంటే ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ణ వ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇలా బ‌ల‌మైన నాయ‌కులు బీజేపీ గుడ్ బై చెప్ప‌డం పార్టీని ఇబ్బందుల్లో ప‌డేసింద‌ని చెప్పాలి. ఇదే స‌మ‌యంలో స‌మాజ్ పార్టీ దూసుకుపోతూ.. అధికారం త‌మ‌దే అనే సంకేతాలు పంపుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios