Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి ఆఫర్ ఎక్కడా వినుండరు: పది పైసలకే బిర్యానీ..!!

చుట్టూ ఎన్నో రకాలైన వంటలు వున్నప్పటికీ బిర్యానీ రుచికి సాటిరాగలది లేదు. అందుకే దేశంలో స్టార్ హోటళ్ల నుంచి వీధి చివరవున్న కాకా హోటల్ వరకు బిర్యానీ మెనూలో ఉండాల్సిందే

Biryani For 10 Paise Sold , To Mark World Food Day in Tamilnadu
Author
Dindigul, First Published Oct 11, 2020, 5:00 PM IST

చుట్టూ ఎన్నో రకాలైన వంటలు వున్నప్పటికీ బిర్యానీ రుచికి సాటిరాగలది లేదు. అందుకే దేశంలో స్టార్ హోటళ్ల నుంచి వీధి చివరవున్న కాకా హోటల్ వరకు బిర్యానీ మెనూలో ఉండాల్సిందే. చికెన్‌, మటన్‌ బిర్యానీ అంటే లొట్టలేసుకొని తినేవారు చాలా మంది ఉంటారు.

బిర్యానీకి ఉన్న ఈ క్రేజ్‌తో చాలామంది వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్లేటు వంద రూపాయలు, యాభై రూపాయలు, పది రూపాయలు అంటూ రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు ఓ హోటల్ ఏకంగా10 పైసలకు బిర్యానీ ఆఫర్ చేసింది.

ఈ రోజు (అక్టోబర్‌ 11) బిర్యానీ డే. ఈ సందర్భంగా తమిళనాడు బిర్యానీ వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దిండిగల్, చెన్నై నగరాలలో 10 పైసలకే బిర్యానీ అమ్మకాలు నిర్వహించారు. దీంతో భారీగా జనం ఎగబడ్డారు. బిర్యానీని అందుకునేందుకు కిలోమీటర్ల మేర బారులు తీశారు.

కరోనా నిబంధనలను పట్టించుకోకుండా బిర్యానీ కోసం స్థానికులు క్యూకట్టారు. ఇది కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో వారు సీరియస్ అయ్యారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్‌ అధికారులు కేసు నమోదు చేశారు. 

మరోవైపు బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ సైతం భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. దాదాపు 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు. అక్కడ ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది. కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios