పశ్చిమ బెంగాల్‌లో బికనీర్ ఎక్స్‌‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ క్రమంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. పాట్నా నుంచి ఈ రైలు గౌహతి వెళుతోంది. జల్పాయ్‌గురి సమీపంలోని మేనాగురి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప‌శ్చిమ బెంగాల్‌లో (west bengal) ఘోర రైలు ప్ర‌మాదం (rail accident) చోటు చేసుకుంది. పాట్నా నుంచి గౌహ‌తి వెళుతున్న గౌహ‌తి-బిక‌నీర్ ఎక్స్‌ప్రెస్ బెంగాల్‌లోని (patna guwahati bikaner express) మైనాగురి స‌మీపంలో గురువారం సాయంత్రం ప‌ట్టాలు త‌ప్పింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో రైలు 40 కిలోమీట‌ర్ల వేగంతో వెళుతుండ‌గా ఆరు బోగీలు త‌ల‌కిందుల‌య్యాయి. అయితే ఆ సమయంలో బోగీలలో ఎంత‌మంది ప్ర‌యాణీకులున్నార‌నే వివ‌రాలు తెలియాల్సి వుంది.

ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, ప‌లువురికి గాయాల‌య్యాయి. రైలు ప్ర‌మాదంలో 12 కోచ్‌లు దెబ్బ‌తిన్నాయ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్ర‌మాద స్ధ‌లానికి డీఆర్ఎం, ఏడీఆర్ఎం చేరుకున్నార‌ని రైల్వే తెలిపింది. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ప‌లువురు బోగీల నుంచి కింద‌కు దూకడం క‌నిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. రైలు భారీ కుదుపుకు లోన‌వ‌డంతో తాము రైలు ప‌ట్టాలు త‌ప్పింద‌ని గుర్తించామ‌ని ఓ ప్ర‌యాణీకుడు తెలిపారు.

"

ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గాను రైల్వే శాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 

రైల్వేశాఖ: 050 34666
బీఎస్ఎన్ఎల్: 03564 255190

తూర్పు మధ్య రైల్వే కంట్రోల్ రూం:

దానాపూర్: 06115-232398/ 07759070004
పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్: 02773677/ 05412-253232
సోనాపూర్: 06158-221645
నౌగాచియా : 8252912018
బరౌనీ: 8252912043
ఖగారియా: 8252912030

బికనీర్ హెల్ప్ లైన్ నెంబర్ : 0151-2208222

జైపూర్ హెల్ప్ లైన్ నెంబర్ : 0141-2725942 / 0141-2201567 / 9001199959