Asianet News TeluguAsianet News Telugu

గర్భవతైన భార్యను ముక్కలు ముక్కలుగా కోసి, పాతిపెట్టిన భర్త...

ఆమెను ప్రతిరోజు తీవ్రంగా కొడుతూ మానసిక వేదనకు గురిచేసేవారు. కాగా, గతవారం ఆమెను గర్భవతి అని కూడా చూడకుండా తీవ్రంగా హింసించారు. అంతటితో ఆగకుండా.. ఆమెను బిగ్హా గ్రామంలోని పొలాల్లోకి లాక్కునిపోయారు. 

Bihar Man Kills Pregnant Wife Over Dowry, Chops Body Into Pieces Before Burying it - bsb
Author
Hyderabad, First Published Jul 27, 2021, 3:34 PM IST

బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం, భార్య గర్భంతో ఉందని కూడా చూడకుండా ముక్కలుగా నరికి చంపేసిన అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాలు.. ఈ ఘటన నలందా జిల్లాలో జరిగింది. నోనియా బిగ్హా గ్రామానికి చెందిన సంజిత్, కాజల్ కు గతేడాది జూన్ 27న వివాహం చేశారు.

పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా భారీగానే ఇచ్చారు. ఆ సమయంలో సంజిత్ కు ఇండియన్ రైల్వేస్ లో గ్రూప్ డీ ఉద్యోగం చేస్తుండేవాడు. తాజాగా, అతనికి టీటీఈగా ప్రమోషన్ వచ్చింది. దీంతో తమకు అదనపు కట్నం కావాలని అత్తింటివారు కొంతకాలంగా కాజల్ ను వేధించసాగారు. ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్రహింసలకు గురిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాజల్ తండ్రి అరవింద్ సింగ్ 80వేల రూపాయలను ఆమె భర్తకు ఇచ్చాడు.

అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. ఆమెను ప్రతిరోజు తీవ్రంగా కొడుతూ మానసిక వేదనకు గురిచేసేవారు. కాగా, గతవారం ఆమెను గర్భవతి అని కూడా చూడకుండా తీవ్రంగా హింసించారు. అంతటితో ఆగకుండా.. ఆమెను బిగ్హా గ్రామంలోని పొలాల్లోకి లాక్కునిపోయారు. అక్కడ ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు. 

అయితే, జులై 17న చివరిసారిగా తన కూతురితో ఫోన్ లో మాట్లాడినట్లు మంజుదేవి చెప్పారు. కాగా, ఫోన్ లో మాట్లాడుతూ, నాకు చాలా భయంగా ఉందని మా అమ్మాయి చెప్పిందని కన్నీటి పర్యంతమయ్యింది. కొన్ని రోజులుగా కాజల్ సెల్ ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. 

సంజిత్ కూడా కాజల్ కన్పించడంలేదని చెప్పాడు. దీంతో, యువతి తండ్రి అరవింద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకన్న హిల్సా పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, నోనియా బిగ్హా గ్రామంలోని పొలాల్లో జులై 20న కొన్ని శరీర భాగాలు ముక్కలు, ముక్కలుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. 

వాటిని కాజల్ శరీర భాగాలుగా అరవింద్ గుర్తించారు. దీంతో, పోలీసులు కజల్ మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికిి తరలించారు. కాగా, సంజిత్ ను, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న హిల్సా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios