కరోనా ఉధృతి: నేటి నుండి బీహార్‌లో లాక్‌డౌన్
బీహార్ లో గురువారం నుండి ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తోంది.
పాట్నా:బీహార్ లో గురువారం నుండి ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తోంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లా, సబ్ డివిజన్, బ్లాక్ హెడ్ క్వార్టర్స్ , మున్సిపల్ ఏరియాల్లో ఆంక్షలు కొనసాగుతాయని ఈ నెల 14 వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు లాక్ డౌన్ ఆంక్షల నుండి మినహాయించారు. విద్యా సంస్థలను మూసివేయనున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా లాక్ డౌన్ కాలంలో రవాణా సేవలు నిలిపివేయనున్నారు.పాట్నాలోని 114 ప్రాంతాల్లో రవాణా సేవలు అందుబాటులో ఉండవన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించినట్టుగా గుర్తించిన ఆటోరిక్షా డ్రైవర్ల వాహనాలను స్వాధీనం చేసుకొంటామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
also read:కరోనా కలకలం: కోవిడ్‌తో హైద్రాబాద్‌లో మరో వజ్రాల వ్యాపారి మృతి
ప్రార్థనా స్థలాలు కూడ మూసివేయబడతాయి. పూజారులు రోజువారీ పూజల కోసం ఆలయాల్లో పూజల కోసం దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల్లోకి అనుమతిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
మోటార్ గ్యారేజీ, మొబైల్ రిపేరింగ్ దుకాణల యజమానులు తమ దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.పరిశ్రమలు, నిర్మాణ రంగంలో కార్యక్రమాలను ప్రభుత్వం అనుమతించింది. అయితే కరోనా నిబంధనలను పాటిస్తూ పనులు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
వ్యవసాయ కార్యక్రమాలు. దీనికి సంబంధించిన దుకాణాలను తెరిచేందుకు అనుమతించారు. ఆటోలు, టాక్సీలు స్థానికంగా తిరిగేందుకు మాత్రమే అనుమతించారు.హోటల్స్, రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి.