గ్యాస్ సిలిండర్ పేలి ఎమ్మెల్యే, ఆయన భార్య తీవ్రగాయాలపాలైన సంఘటన బీహార్ రాష్ట్రంలోని తారాపూర్ పట్టణంలోని ముంగర్ ప్రాంతంలో జరిగింది. తారాపూర్ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి ఇంట్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండరు ప్రమాదవశాత్తూ పేలింది. 

ఈ ఘటనలో మేవలాల్ చౌదరితోపాటు అతని భార్య మాజీ ఎమ్మెల్యే నీతా చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భాగల్ పూర్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పట్నాలోని ఆసుపత్రికి తరలించారు.