పాట్నా: బీహార్  రాష్ట్రంలోని హిల్సా అసెంబ్లీ స్థానాన్ని జేడీ(యూ)  కేవలం 12 ఓట్ల తేడాతో గెలుచుకొంది. ఆర్జేడీపై జేడీ(యూ) అభ్యర్ధి విజయం సాధించాడు.

జేడీ(యూ) అభ్యర్ధి కృష్ణమురారి శరణ్   61,848 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ అభ్యర్ధి శక్తిసింగ్ యాదవ్ కు 61,836 ఓట్లు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం వెబ్ సైట్ ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఈ గణాంకాలను ప్రకటించింది. 12 ఓట్లతో జేడీ(యూ) అభ్యర్ధి విజయం సాధించినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అన్యాయం చోటు చేసుకొందని ఆర్జేడీ ఆరోపించింది.

హిల్సా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్జేడీ అభ్యర్ధి శక్తిసింగ్ తన ప్రధాన ప్రత్యర్ధి జేడీ(యూ) అభ్యర్ధి శక్తిసింగ్ ను 547 ఓట్ల తేడాతో విజేతగా ప్రకటించారు. అయితే ధృవీకరణ పత్రం తీసుకోవడానికి వెయిట్ చేయాలని రిటర్నింగ్ అధికారి కోరాడు. 

also read:బీహార్ లో సత్తా చాటిన అసుద్దీన్ ఓవైసీ: తేజస్వీ యాదవ్ మీద దెబ్బ

ధృవీకరణ పత్రం కోసం ఆర్జేడీ అభ్యర్ధి ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సీఎం కార్యాలయం నుండి పోన్ వచ్చింది. దీంతో పోస్టల్ బ్యాలెట్లు రద్దు కావడంతో ఆర్జేడీ అభ్యర్ధి 13 ఓట్లతో ఓటమిపాలయ్యాడని రిటర్నింగ్ అధికారి ప్రకటించాడని ఆర్జేడీ ఆరోపించింది.ఈ విషయమై ఆర్జేడీ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది.

ఆర్జేడీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఈ విషయంలో ఎవరి ఒత్తిడులు లేవని తెలిపింది.జేడీ(యూ)కు చెందిన కృష్ణమురారి శరణ్ 232  పోస్టల్ బ్యాలెట్ ఓట్లు , ఆర్జేడీ అభ్యర్ధి శక్తిసింగ్ యాదవ్ కు 233 ఓట్లు దక్కాయి.