Asianet News TeluguAsianet News Telugu

BJP: శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయంటూ బీజేపీ మౌనదీక్ష‌

Bihar: "బీహార్‌లో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి. పాట్నాలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశ వేదిక నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఇసుక మాఫియా మధ్య హింసాత్మక ఘర్షణ జరగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు" అని బీజేపీ నాయ‌కుడు సుశీల్ మోడీ అన్నారు. 
 

Bihar : BJP's silent protest against deteriorating law and order situation : Sushil Modi
Author
First Published Oct 1, 2022, 4:59 PM IST

BJP silent protest:  బీహార్ లో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయ‌ని పేర్కొంటూ.. అక్క‌డి సంకీర్ణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) మౌన‌దీక్ష‌కు దిగి నిర‌స‌న తెలుపుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కుడు సుశీల్ కుమార్ మోడీ అన్నారు. బీహార్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆదివారం పాట్నాలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర 15 నిమిషాల మౌన నిరసనను నిర్వహించనుందని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలకు వ్యతిరేకంగా 15 నిమిషాల మౌనం పాటించడం ద్వారా బీజేపీ ఒక రకమైన లాంఛనప్రాయ నిరసనను నిర్వహిస్తుందన్నార‌ని ఏఎన్ఐ నివేదించింది. 

బీహార్‌లోని అర్రాహ్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో శుక్రవారం ఉదయం నడకకు వెళుతున్న బీజేపీ నాయకుడు, కాంట్రాక్టర్ బబ్లూ సింగ్‌పై దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి కాల్పుల ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయని సుశీల్ మోడీ పేర్కొన్నారు. "బీహార్‌లో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి. పాట్నాలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశ వేదిక నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఇసుక మాఫియా మధ్య హింసాత్మక ఘర్షణ జరగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దోషులు చాలా బలంగా ఉన్నారు. తమలో తాము మృతదేహాలను కూడా తీసుకెళ్లామనీ, పోలీసులు ఇప్పటి వరకు వాటిని కనుగొనలేకపోయారని, అదే ప్రాంతంలో రైడ్ చేయడానికి వెళ్లినప్పుడు వారు మళ్లీ పోలీసులపై దాడి చేశారని" ఆయన అన్నారు.

రాష్ట్రంలో క్రైం రేటును పోల్చి చూస్తే.. బీజేపీ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదని మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులపై నేరగాళ్లు దాడి చేయడం, ఇసుక అక్రమ దందాలో ఐదుగురు మృతి చెందడం, నేరగాళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్న ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. "లాలూ రాజ్" రాష్ట్రానికి తిరిగి వచ్చారని బీహార్ ప్రజలు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి క్రిమినల్ నేరాలు ఎక్కడ జరిగినా పార్టీ సభ్యులు బాధితురాలిని కలవడానికి వెళ్తార‌ని చెప్పారు. బబ్లూ సింగ్‌పై దాడికి సంబంధించిన అన్ని వివరాలను తాము తీసుకున్నామనీ, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లాంఛనప్రాయ నిరసన చేపడతామని సుశీల్ మోడీ తెలిపారు.

సుశీల్ మోడీ కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఎవరు వచ్చినా గాంధీ కుటుంబానికి తోలుబొమ్మ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. "మ‌ల్లికార్జున్ ఖర్గే లేదా మరొకరు, ఎవరు చీఫ్ అయినప్పటికీ, అతను కేవలం ముఖం చూపించడానికి మాత్రమే ఉంటాడు.  గాంధీ కుటుంబానికి కీలుబొమ్మగా ఉంటాడు.. ఎందుకంటే అసలు నిర్ణయాలు వారు మాత్రమే తీసుకుంటారు" అని సుశీల్ మోడీ అన్నార‌ని ఏఎన్ఐ నివేదించింది. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష  ఎన్నికల బరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, కేరళ ఎంపీ శశిథరూర్, త్రిపాఠీలు నామినేషన్ వేశారు. అయితే, జార్ఖండ్ కు చెందిన కేఎన్‌ త్రిపాఠి దాఖలు చేసిన నామినేషన్ సెట్ రిజెక్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీలో నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios