Asianet News TeluguAsianet News Telugu

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత: రాజ్‌నాథ్ కీలక ప్రకటన

భారత్- చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ శా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

Big Breakthrough In China Standoff; Government Says Not Conceded Anything lns
Author
New Delhi, First Published Feb 11, 2021, 3:59 PM IST

న్యూఢిల్లీ:భారత్- చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ శా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకొన్నట్టుగా చెప్పారు.

చైనా రక్షణ మంత్రితో చర్చించిన మీదట పూర్తిస్థాయిలో బలగాలను ఉపసంహరణపై అంగీకారం కుదిరిందన్నారు. మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 

ఇవాళ రాజ్యసభలో ఈ విషయమై ఆయన ప్రకటన చేశారు. భారత, చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు ఎట్టకేలకు తెరదించింది.చైనాకు ఒక్క అంగుళం భూమి కూడ వదులుకొనే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో భారత సైనికులు అత్యంత ధైర్య సాహాలతో పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసలు కురిపించారు.

మూడు అంశాల ఆధారంగా సమస్య పరిష్కరించుకోవాలని చైనాకు సూచించినట్టుగా తెలిపారు. ఇరువైపులా నుండి ప్రయత్నాలు ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు.ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయి. భారత బలగాలు ఫింగర్ 2 వద్ద పర్మినెంట్ బేస్ వద్ద ఉంటాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios