హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ  కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించింది.

రెండు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా భారత్ బయోటెక్ సంస్థ ఇదివరకే ప్రకటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. దేశంలోని 25 కేంద్రాల్లోని 26 వేల మందిపై ఈ ప్రయోగాలు చేస్తున్నట్టుగా భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.

త్వరలోనే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి: తమిళిసై

18 ఏళ్లకు పైబడిన వలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఆ సంస్థ తెలిపింది.మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ నుండి గత నెల 2వ తేదీన అనుమతిని కోరింది. మూడోదశ ట్రయల్స్ కు డీసీజీఐ నుండి అనుమతి రాగానే మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించింది.

ఈ వ్యాక్సిన్ తో పాటుగా ముక్కులో వేసుకొనే చుక్కల మందు తయారీపై కూడ ప్రయోగాలు చేస్తున్నట్టుగా భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా ప్రకటించారు.