తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా  ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం అని.. ఇక్కడి ప్రజలు కష్ట జీవులని చెప్పుకొచ్చారు. అనేక రంగాల్లో తెలంగాణ ప్రజలు తమదైన ముద్రవేసి దూసుకువెడుతున్నారని ప్రశంసించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని ప్రధాని తెలిపారు. 

కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఉదయం నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తోంది. గన్ పార్క్ వద్ద సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి,  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. 

గత ఏడాది కూడ కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడ నిరాడంబరంగా నిర్వహించారు.  తొలి దశతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలువురు తమ ప్రాణాలు త్యాగం చేశారు  గన్ పార్మ్ వద్ద నివాళులర్పించిన సందర్భంగా పలువురు అమరులను స్మరించుకొన్నారు. అమరుల స్మారక మందిరాన్ని నిర్మింవచేందుకు కూడ తెలంగాణ ప్రభుత్వం కసర్తు చేస్తోంది. దీనికి సంబందించిన డిజైన్లను కూడ తయారు చేయిస్తోంది.