Asianet News TeluguAsianet News Telugu

చీపురుతో భర్తను కొట్టిన భార్య: భర్త ఏం చేశాడంటే...

భార్య, అత్త చీపురుతో కొట్టడంతో అవమానాన్ని భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
 

Bengal Man dies by suicide after wife, mother-in-law thrash him with brooms
Author
New Delhi, First Published Jul 26, 2020, 11:11 AM IST


కోల్‌కత్తా: భార్య, అత్త చీపురుతో కొట్టడంతో అవమానాన్ని భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

బెంగాల్ రాష్ట్రంలోని జషోదంగ గ్రామానికి చెందిన సౌమిత్రి అధికారి శనివారంనాడు రాత్రి తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

శనివారం నాడు ఉదయం సౌమిత్రి  అధికారి అత్తగారింటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్య ఆమె తల్లి ఆయనపై చీపురుతో దాడికి పాల్పడ్డారు. సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకు ఈ విషయాన్ని తనకు చెప్పినట్టుగా తల్లి పోలీసులకు వివరించింది.

అత్తింటికి వెళ్లిన సౌమిత్రి అధికారికి ఆయన భార్యకు ఓ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో భార్యాభార్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలోనే సౌమిత్రి భార్య భర్తను చీపురుతో కొట్టింది.

అక్కడే ఉన్న సౌమిత్రి అత్త కూడ మరో చీపురు తీసుకొని అల్లుడిపై దాడి చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పి తీవ్రంగా బాధపడ్డాడు.  ఈ ఘటనతో మనోవేదనకు గురైన బాధితుడు శనివారం నాడు ప్యాన్ కు ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios