Asianet News TeluguAsianet News Telugu

భార్య కోసం రూ. 90 వేలతో బైక్ కొన్న బిచ్చగాడు.. సంపాదన ఎంతో తెలిస్తే...

మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఓ బిచ్చగాడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. అతను చేసిన పని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలతనేం చేశాడంటే...

Beggar buys motorcycle worth Rs 90,000 for his wife In Madhya Pradesh
Author
Hyderabad, First Published May 25, 2022, 7:13 AM IST

భోపాల్ : Madhya Pradesh లోని భోపాల్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ Beggar చేసిన పని ఇప్పుు అందర్నీ ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. భార్య మీద ఇంత ప్రేమా.. అని... నిజంగా అంత Earnings ఉంటుందా? అని రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ అతను చేసిన పని ఏంటో తెలుసా....

సంతోష్ కుమార్ సాహూ అనే వృద్ధుడు.. రూ.90 వేలు ఖర్చు చేసి తన భార్య కోసం మోటార్ సైకిల్ ను కొనుగోలు చేశాడు. గతంలో తమకు ఓ వాహనం ఉన్నా.. దానిమీద కూర్చుంటే తన wifeకు వెన్ను నొప్పి వస్తోందని, అందుకే కొత్త వాహనాన్ని కొనుగోలు చేశానని సంతోష్ కుమార్ సాహూ తెలిపారు. ఇప్పుడు ఇద్దరం కలిసి భోపాల్, ఇండోర్, ఇటార్సి తదితర ప్రాంతాలకు సులభంగా వెల్తున్నామని ఆనందం వ్యక్తం చేశాడు. 

మధ్యప్రదేశ్ లోని చింద్వారాకు చెందిన బిచ్చగాడు సంతోష్ సాహూ వికలాంగుడు. అతని భార్య మున్నీ సాయంతో ఇద్దరూ కలిసి ఓ ట్రై సైకిల్ మీద ప్రయాణిస్తూ బిక్షాటన చేసేవారు. అతడు ట్రై సైకిల్ మీ కూర్చుంటే.. అతని భార్య సైకిల్ తోసుకుంటూ బిక్షం అడుగుతుండేది. అయితే, ఇటీవల సంతోష్ సాహూ భార్య అనారోగ్యానికి గురయ్యింది. ఆమె చికిత్స కోసం రూ.50వేలు ఖర్చు చేశాడు. చికిత్స తరువాత కోలుకున్నా.. బలహీనంగా తయారయ్యింది. దీంతో ఆమె ట్రై సైకిల్ ను తోయలేకపోతోంది. దీంతో భార్య కష్టం చూడలేక ఆ యాచకుడు చలించిపోయాడు. 

ఎలాగైనా భార్య కోసం ఓ బైక్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రూ.90 వేలతో మోపెడ్ మోటార్ సైకిల్ కొనుగోలు చేశాడు. దాన్ని తన భార్య మున్నీకి బహుమతిగా అందించాడు. మోటార్ సైకిల్ తో తన భార్యకు ట్రై సైకిల్ తోయాల్సిన పనిలేదని చెబుతున్నాడు. ఇద్దరం కలిసి హాయిగా బైక్ మీదే వెళ్లి అడుక్కోవచ్చని చెబుతున్నారు. పైగా, బైక్ కొన్న తరువాత ఆ యాచకుడు తనకు సాయం చేసిన వారికి మిఠాయిలు కూడా పంచాడు. అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 

దీనిమీద అతను మాట్లాడుతూ.. సుమారు 4 సంవత్సరాల పాటు బైక్ కోసం ఒక్కో రూపాయి దాచిపెట్టానని సంతోష్ సాహు తెలిపాడు. ఇప్పుడు హాయిగా భార్యను వెనక కూర్చోబెట్టుకుని భిక్షం ఎత్తుకుంటున్నానని చెబుతన్నాడు సంతోష్. అతని భార్య భిక్షాటనలో రోజుకు 300-400 రూపాయలు సంపాదిస్తామని చెబుతున్నారు. భిక్షాటనలో వారికి రెండు పూటలా ఆహారం కూడా లభిస్తుంది. ఇకపోతే, గతంలో చింద్వారా వీధుల్లో బార్ కోడ్ లో డబ్బులు తీసుకున్న బిచ్చగాడు కూడా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు అడిగి ద్విచక్ర వాహనాలు కొన్న బిచ్చగాళ్ల జంట కూడా చర్చనీయాంశంగా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios