న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆలయ ద్వారాలను శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు తెరిచారు. ప్రధానార్చకుడితో పాటు 27 మందిని మాత్రమే లోనికి అనుమతి ఇచ్చారు. 

భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు భక్తులను అనుమతించలేదని అధికారులు చెబుతున్నారు. 

ఏప్రిల్ 29వ తేీదన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరిచారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత ద్వారాలు తెరిచారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యాత్రికులను అనుమతించడం లేదు. కేదార్ నాథ్ ఆలయాన్ని తెరిచిన తర్వాత యాత్రికులు లేకుండానే పంచముఖి డోలీ యాత్ర నిర్వహించారు.