ముంబై: అయోధ్యలో  రామ మందిర నిర్మాణానికి ఆర్ధినెన్స్ తేవాలని శివసేన చీఫ్  ఉద్దవ్ థాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు ఆయన  యూపీలోని రాంలాలాను సందర్శించారు. అనంతరం  మీడియాతో మాట్లాడారు.ఆర్డినెన్స్ తీసుకురావడానికి  ఉన్న అడ్డంకులు ఏమిటో చెప్పాలని ఆయన కోరారు. ఆర్డినెన్స్ తెస్తే తాము పూర్తి మద్దతిస్తామని ఉద్దవ్ తేల్చి చెప్పారు.

చట్టమో చేస్తారో లేదో చర్చలే జరుపుతారో  కానీ అయోధ్య నిర్మాణాన్నిపూర్తి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.తాను అయోధ్యను సందర్శించడంలో రహస్య ఎజెండా ఏమీ లేదన్నారు. 

అయోధ్యను ఎన్నికల అస్త్రంగా మార్చుకొన్నారని ఆయన పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.రామ మందిరం చుట్టూ అంతమంది పోలీసులను చూస్తే బాధ కలుగుతోందన్నారు.