Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం అద్భుతమైన వాస్తు, శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమవుతోంది. రామాలయ నిర్మాణికి సంబంధించి ఇప్పటివరకు జరగిన.. జరుగుతున్న పనుల గురించి రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా.. ఏషియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిరం పై ఇప్పుడు దేశం యావత్తు దృష్టి కేంద్రీకృతమై ఉంది. రామ మందిర నిర్మాణం కోసం సుప్రీమ్ కోర్టు తీర్పును అనుసరిస్తూ ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేసిన నాటి నుండి రామ మందిరం ఎలా నిర్మించబోతున్నారంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది..! 2023 డిసెంబర్ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్న నేపథ్యంలో... నిర్మాణం ఎలా సాగుతుంది, ఇంకా ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది అనే విషయాలను నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా.. ఏషియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు."
అద్భుతమైన హస్తకళ మరియు ప్రపంచ టాప్ ఇంజనీరింగ్‌కు చిహ్నంగా అయోధ్య రామాలయ నిర్మాణం జరగుతున్నదని నృపేంద్రమిశ్రా వెల్లడించారు. దేశంలోని కోట్లాది మందికి ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ఆయోధ్య రాముని ఆయల నిర్మాణంలో అన్ని ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన బన్సీ పహాడ్ రాయిని ఉపయోగిస్తున్నారు. దేశంలోని టాప్ ఇంజినీర్లు ఆలయ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. 2.7 ఎకరాల్లో 54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2020 ఫిబ్రవరిలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన మిశ్రా.. ఆలయానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుతూ.. ఎండలు మండుతున్న సమయంలోనూ ఆయన నిర్మాణ పనులు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు. పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు డ్రిల్లింగ్, గ్రానైట్ రాళ్లను ఎత్తే భారీ క్రేన్లు, మిక్సింగ్ ట్రక్కులు సైట్ ఉన్నాయి.

ఆయయ నిర్మాణానికి సంబంధించి ప్రకృతి నుంచి ఎదురయ్యే సవాళ్లను గురించి మిశ్రా మొదటగా మాట్లాడారు. రామాలయ నిర్మాణంలో మొత్తం పునాది ఇనుము లేకుండా మరియు కుదించబడిన ఇంజనీరింగ్ మట్టితో ఎలా తయారు చేయబడుతుందనే దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. "2023 డిసెంబర్ నాటికి గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ ను పూర్తి చేయగలగడం మా ఉత్తమ ప్రయత్నం. ఆలయానికి తూర్పున వెళ్ళే ఐదు మండపాలు ఉన్నాయి. ఆ ఐదు మండపాలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి. ఆ తర్వాత మొదటి అంతస్తును మూడు మండపాలతో.. చివరకు రెండో అంతస్తులో రెండు మండపాలను నిర్మిస్తారు. ఆ విధంగానే ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తాం' అని మిశ్రా పేర్కొన్నారు. "ఇంకా మిగిలి ఉన్న పనిని మీరు ఊహించుకోవచ్చు. 2024 చివరి నాటికి అన్ని అంతస్తులు పూర్తవుతాయని నేను అంచనా వేయగలను. లోపల శిల్పాలు చెక్కడం మరియు ఇన్‌కోనోగ్రఫీ ఇంకా కొనసాగుతుంది" అని అన్నారు.
అయితే, మిశ్రాకు ఉన్న సవాలు ఆలయాన్ని నిర్మించడంతో ముగియదు. 67 ఎకరాల ఆలయ సముదాయాన్ని కూడా ఏకకాలంలో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. "ఆలయం చుట్టూ 67 ఎకరాల విస్తీర్ణం ఉంది.. దీనిని ఆలయ సముదాయం అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో అధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేసే ఆలోచనలు ఉన్నాయి. ఉదాహరణకు, వాల్మీకి, నిషాద మరియు శబరి మాతలకు సంబంధించిన దేవాలయాలు అక్కడ నిర్మించనున్నాము. రాముడు దేవుడు అని ఏ ప్రత్యేక సమాజం ఆయనను ఎత్తుకోలేదని విశ్వసించేలా.. అన్ని వర్గాలలు విశ్వసించేలా అన్ని వర్గాలను, అన్ని మతాల ప్రజలను నమ్మేలా చేసే దేవాలయాలు మనకు ఉండాలి" అని ఆయన అన్నారు.

ఈ ఇంటర్వ్యూ లో మరో ఆసక్తికరమైన విషయాన్ని మిశ్రా వెల్లడించారు. అది శ్రీరాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడే విధంగా ఆలయ నిర్మాణం.. దీని గురించి ఆయన వివరిస్తూ.. "శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఆయన మధ్యాహ్నానికి జన్మించాడని నమ్మకం. కాబట్టి మధ్యాహ్న సమయంలో శ్రీరాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడే విధంగా.. ఐదు నుంచి 10 నిమిషాల వరకు సూర్యకిరణాలు పడేలా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తున్నాం" అని తెలిపారు. అయోధ్య రామాలయంలో లో "తూర్పున ఉన్న ద్వారం.. గోపురం శైలిలో ఉంటుంది. ఇది దక్షిణాన ఉన్న దేవాలయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది" అని మిశ్రా చెప్పారు. 'ఉపయోగించే ప్రతి మెటీరియల్, ఉపయోగించే ప్రతి డిజైన్ మరియు డ్రాయింగ్ ను ఐఐటీ చెన్నైపరిశీలిస్తోంది. దీనిని ఎల్ అండ్ టీ, టీసీఈ (టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్) పరీక్షిస్తున్నాయి. ఈ ఆలయం మరో వేయి సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా నిర్మాణం కొనసాగిస్తున్నామని తెలిపారు.

