లక్షల దీపాల కాంతుల్లో మెరిసిపోనున్న అయోధ్య ... ఈ దీపావళికి యోగి గట్టిగానే ప్లాన్ చేసారుగా

ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు యోగి సర్కార్ సిద్దమయ్యింది. ఈ క్రమంలో ఇప్పటినుండే ఆ ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి... ఇంతకూ యోగి సర్కార్ వేడుకలను ఎలా ప్లాన్ చేసిందో తెలుసా? 

Ayodhya Diwali brings prosperity to potters AKP

అయోధ్య : రామనగరిలో జరిగే దీపోత్సవం అయోధ్యలోని కుమ్మరుల జీవితాలను మార్చేసింది. ఒకప్పుడు రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న కుమ్మరివాాళ్లు ఇప్పుడు దీపోత్సవం సమయంలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దీపోత్సవం మొదలైన తర్వాత కుమ్మరి కుటుంబాల యువత బయటకు వెళ్లకుండా ఎలక్ట్రిక్ చాక్ తిప్పడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జయసింగ్‌పూర్ గ్రామంలో దీపోత్సవం కోసం భారీగా ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఈసారి అయోధ్య ఆలయంలో 25 లక్షల దీపాలు 

2017లో రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. భగవాన్ రాముడు వనవాసం ముగించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకునే దీపావళి పండగ వేళ దీపోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.

అయితే దీపాల కొనుగోలు కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లాలోని కుమ్మరులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఫలితంగా ఈ ఏడాది దీపోత్సవం ఎనిమిదో సారి వైభవంగా జరగనుంది. కుమ్మరులు భారీ సంఖ్యలో దీపాల తయారీని ప్రారంభించారు. ఈసారి బాలరాముడు భవ్యమైన ఆలయంలో ప్రతిష్టించబడ్డారు. అందువల్ల ఎనిమిదో దీపోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే 25 లక్షల దీపాలను వెలిగించాలని సీఎం యోగి ప్రకటించారు.

 ఈ క్రమంలోనే భారీ దీపాలను సమకూర్చుకునే పనిలో పడింది యోగి సర్కార్. 25 లక్షల దీపాలను వెలిగించాల్సి ఉండటంతో కుమ్మరి కుటుంబాలన్ని పనిలో నిమగ్నమైంది. అయోధ్యలోని విద్యాకుండ్ సమీపంలోని జయసింగ్‌పూర్ గ్రామంలో కుమ్మరులు భారీ ఎత్తున దీపాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇక్కడి 40 కుటుంబాలు దీపోత్సవం కోసం దీపాలను తయారు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ జీవితాలను మార్చేశారని వారు అంటున్నారు. దీపోత్సవంలో దీపాల అమ్మకాలు ఎప్పుడూ జరుగుతాయి, కానీ స్థానిక కుమ్మరులకు మద్దతుగా నిలిచేలా ప్రజలు మట్టి దీపాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

30 నుంచి 35 వేల దీపాలను విక్రయిస్తున్నాం

 జయసింగ్‌పూర్ గ్రామానికి చెందిన లక్ష్మి ప్రజాపతి మాట్లాడుతూ... యోగి ప్రభుత్వ పథకం మా ఇంటిని వెలిగించిందని అన్నారు. దీపోత్సవంలో దీపాలు తయారు చేయడానికి ఆర్డర్లు వచ్చిన వెంటనే కుటుంబమంతా పనిలో నిమగ్నమవుతుంది. 30 నుంచి 35 వేల దీపాలను తయారు చేసి విక్రయిస్తున్నాం.

సీఎం ప్రకటన తర్వాత ఆదాయం పెరిగింది

 జయసింగ్‌పూర్ గ్రామానికి చెందిన రాకేష్ ప్రజాపతి మాట్లాడుతూ... ఈ ఏడాది ఇంకా మాకు కాంట్రాక్టు రాలేదని, కానీ గత సంవత్సరాలలో వచ్చిన ఆర్డర్లను దృష్టిలో ఉంచుకుని దీపాల తయారీని ప్రారంభించామని అన్నారు. సీఎం ప్రకటన తర్వాత మా ఆదాయం పెరిగింది.

గతంలో ప్రజలు చైనా దీపాలతో ఇళ్లను అలంకరించేవారు

 గ్రామానికి చెందిన ఆశ మాట్లాడుతూ... ప్రతి ఏటా 20 నుంచి 25 వేల దీపాలను తయారు చేసి దీపోత్సవం కోసం అందిస్తున్నామని అన్నారు. దీపోత్సవం మొదలైన తర్వాత నగర ప్రజలు తమ ఇళ్లను దీపాలతో అలంకరిస్తున్నారు. లేకపోతే ప్రజలు చైనా దీపాలను ఉపయోగించేవారు.

సీఎం యోగి ప్రజాపతులకు గుర్తింపు తెచ్చారు

 గ్రామానికి చెందిన రాజేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. దీపోత్సవం తర్వాత ప్రజాపతులకు గుర్తింపు వచ్చిందంటే అది సీఎం యోగి వల్లనేనని అన్నారు. లేకపోతే మమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఇంకా టెండర్లు పిలవలేదు, కానీ మేము ఇప్పటికే 2 లక్షలకు పైగా దీపాలను సిద్ధం చేశాం.

దీపోత్సవం కౌంట్‌డౌన్ ప్రారంభం

ఎనిమిదో దీపోత్సవం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత అయోధ్య నగరం కొత్త చరిత్ర సృష్టిస్తుంది. దీపోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అధికారులతో పాటు అవధ్ విశ్వవిద్యాలయ యాజమాన్యం, విద్యార్థులు కూడా ఈ ఏర్పాట్లలో పాల్గొనబోతున్నారు.

ఏ సంవత్సరం ఎన్ని దీపాలు వెలిగించారు...

  • 2018- 3.01 లక్షలు
  •  2019- 4.04 లక్షలు
  •  2020- 6.06 లక్షలు 
  • 2021- 9.41 లక్షలు
  •  2022- 15.76 లక్షలు
  • 2023- 22.23 లక్షలు
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios