యువకుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం : కర్ణాటక బాదామి జిల్లాలో దారుణం

First Published 31, May 2018, 5:18 PM IST
Auto driver sexually assaults  young boy at karnataka
Highlights

వీడియో తీసి... యూట్యూబ్ లో పెడతానంటూ బాధితుడికి బెదిరింపు

ఓ యువకుడిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక లోని బాదామి జిల్లాలో చోటుచేసుకుంది. ఆటోలో ఒంటరిగా వున్న యువకుడిని తన నివాసానికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ అత్యాచారాన్ని తన సెల్ ఫోన్ లో వీడియో తీసి యూట్యూబ్ లో పెడతానంటూ  బాధిత యువకుడినే బెదిరించాడు. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ  విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాదామి జిల్లా బనశంకరి పట్టణంలోని ఓ మీడియా సంస్థలో మను అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు ఈ నెల 23 న రాత్రి 8 గంటల సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లడానికి ఓ ఆటో ఎక్కాడు. అయితే మార్గ మద్యలో ఆటో డ్రైవర్ రాజేష్ నాయుడం హళ్లి ప్రాంతంలోని తన నివాసం వద్ద ఆటో ఆపి బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికి మను ను ఇంట్లోకి రమ్మని పిలిచాడు. ఏదైనా సాయం కావాల్సి వచ్చి పిలిచాడేమోనని మను ఆ ఇంట్లోకి వెళ్లాడు.దీంతో అప్పటికే నగ్నంగా ఉన్న రాజేష్ మనుపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్ లో బంధించి ఎవరికైనా చెబితే యూట్యూబ్ లో పెడతానని బెదిరించాడు.

అయితే ఈ ఘటనతో భయపడిపోయిన మను ఈ విషయాన్ని తన సహోద్యోగులకు తెలిపాడు. దీంతో వారు బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆటో డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడు తెలిపిన వివరాలతో ఆటోడ్రైవరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  
 

loader