Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ధాని బ‌హుమ‌తులు వేలం.. ‘నమామి గంగే మిషన్’కే కేటాయించనున్న ఆదాయం

ప్రధాని నరేంద్ర మోడీకి పలు సందర్భాల్లో క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, ఇతర వ్యక్తులు అందించిన బహుమతులను వేలం వేయనున్నారు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే మిషన్ కు కేటాయించనున్నారు. 

Auction of Prime Minister Modi's gifts.. Proceeds earmarked for 'Namami Gange Mission'
Author
First Published Sep 12, 2022, 9:48 AM IST

ప్రధాని నరేంద్ర మోడీకి వివిధ సందర్భాల్లో బహుమతిగా వచ్చిన 1200 వస్తువులను సెప్టెంబర్ 17 నుంచి వేలం వేయనున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని 'నమామి గంగే మిషన్‌'కి అందజేయనున్నారు. క్రీడాకారులు, రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి ఈ బహుమతులను అందించారు. 

దారుణం.. త‌క్కువ కులం వ్య‌క్తిని ప్రేమించింద‌ని కూతురిని చంపి, మృత‌దేహాన్ని కాల్చేసిన రైతు..

ఈ వేలం పాటును pmmementos.gov.in వెబ్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తామని, ఇది అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుందని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత్ గడ్నాయక్ తెలిపారు. భారత దేశపు గొప్ప సంస్కృతి, వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సామాన్యులు, పలువురు ప్రముఖులు ఇచ్చిన కానుకలను వేలం వేయనున్నట్లు ఆయన తెలియజేశారు. బహుమతుల విలువ రూ.100 నుండి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

దక్షిణాఫ్రికా నుంచి 25 చిరుత పులులను తీసుకురాబోతున్న ప్రభుత్వం

బహుమతుల జాబితాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బహుమతిగా ఇచ్చిన రాణి కమలాపతి విగ్రహం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహుమతిగా ఇచ్చిన సూర్య పెయింటింగ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ బహుమతిగా ఇచ్చిన త్రిశూలం ఉన్నాయి. ఈ జాబితాలో NCP నాయకుడు అజిత్ పవార్ బహుమతిగా ఇచ్చిన మహాలక్ష్మి దేవి విగ్రహం కూడా ఉంది. 

ప్రధాని మోదీ అందుకున్న బహుమతులు ఇలా ఇ-వేలం వేయడం ఇది నాలుగో సారి. ఈ విషయంలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ టెంసునారో జమీర్ మాట్లాడుతూ.. పతకాలు సాధించిన క్రీడాకారులు సంతకం చేసిన టీ షర్టులు, బాక్సింగ్ గ్లౌజులు, జావెలిన్ వంటి క్రీడా వస్తువుల ప్రత్యేక సేకరణ తమ వద్ద ఉందన్నారు. 
ఆచారాల పేరిట మహిళపై అత్యాచారం.. దొంగ బాబాను అరెస్టు చేసిన పోలీసులు

ఈ బహుమతుల్లో అత్యద్భుతమైన పెయింటింగ్స్, శిల్పాలు, హస్తకళలు, జానపద కళాఖండాలు కూడా ఉన్నాయని చెప్పారు. సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, సంప్రదాయ కత్తులు మొదలైన అనేక వస్తువులను బహుమతులుగా ఇస్తారు. ఇతర జ్ఞాపికల్లో అయోధ్యలోని శ్రీరామ మందిరం, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ నమూనాలు, ప్రతిరూపాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios