11 ఏళ్ల ముస్లిం బాలుడిపై మరో వర్గానికి చెందిన ఇద్దరు మైనర్లు తీవ్రంగా దాడి చేశారు. జై శ్రీరాం, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినదిస్తూ చితకబాదారు. ఈ సమయంలో బాధితులు బట్టలు కూడా విప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల ముస్లిం బాలుడిని మరో వర్గానికి చెందిన మైనర్లు తీవ్రంగా కొట్టారు. బట్టలు విప్పేసి చితకబాదారు. జై శ్రీరాం, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ అసద్ అహ్మద్ హతం.. యూపీ సీఎం యోగికి థ్యాంక్స్ చెప్పిన ఉమేష్ పాల్ భార్య..
అయితే ఈ దారుణ ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం పట్ల పలువురు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై విరుచుకుపడుతున్నారు. ఇండోర్ లోని నిపానియా ప్రాంతంలో స్టార్ స్క్వేర్ సమీపంలో 11 ఏళ్ల ముస్లిం బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే ఈ సమయంలో మరో వర్గానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆ బాలుడి దగ్గరికి వచ్చారు. బైపాస్ లోని బెస్ట్ ప్రైస్ దగ్గర బొమ్మలు కొనిస్తామంటూ తమ వెంట తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహాలక్ష్మి నగర్ సమీపంలోకి తీసుకెళ్లిన నిందితులు.. బాలుడిని చితకబాది మత పరమైన నినాదాలు చేశారు.
హనుమాన్ జయంతి ర్యాలీలో హింసాకాండ.. మత ఘర్షణలో 10 మంది పోలీసులకు గాయాలు.. వాహనాలకు నిప్పు
అయితే వారి బారి నుంచి బాధితుడు ఎలాగోలా తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులను ఆశ్రయించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి నిందితులైన మైనర్లపై కిడ్నాప్, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేయవద్దని నెటిజన్లను పోలీసులు కోరారు.
