దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం.. పొలంలో పడేసి పరారీ..
ఓ వివాహిత నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తరువాత ఓ ప్రదేశానికి తీసుకెళ్లిని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఓ పొలంలో పడేసి పారిపోయారు. పోలీసులు ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు.

నేడు సమాజంలో మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కరువయ్యింది. ఎక్కడ చూసినా వారిపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు దారుణానికి ఒడిగడుతున్నారు. ఎత్తుకెళ్లి మరీ ఘోరానికి పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఓ వివాహితను పలువురు దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చేన్లో పడేసి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లాలో 35 ఏళ్ల వివాహితను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ ప్రదేశానికి తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
దారుణం.. భార్యను హతమార్చి, ఇంటి వెనక మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భర్త..
బాధితురాలికి గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం బాధితురాలిని వ్యవసాయ పొలంలో ఆదివారం వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని షాడోరాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అశోక్ నగర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
భార్య, కూమారుడిని హతమార్చి జైలుకు.. బెయిల్ పై వచ్చినా.. ఎవరూ మాట్లాడకపోవడంతో ఆత్మహత్య..
కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ముగ్గురు తనకు తెలిసిన వారే అని బాధితురాలు పోలీసులతో వెల్లడించారు. తాను అపస్మారకస్థితికి వెళ్లిపోయిన తరువాత వ్యవసాయ పొలంలో పడేసివెళ్లిపోయారని చెప్పారు. కాగా., ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల్లో ఒకరు బాధితురాలి భర్త నిందితుడిగా ఉన్న హత్య కేసులో సాక్షిగా ఉన్నాడు. బాధితురాలి వైద్య పరీక్షల రిపోర్టుల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనపై గ్యాంగ్ రేప్, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కింద సంబంధిత భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.