తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు
తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది
