5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై విధించిన నిషేధం గడువు నేటితో ముగిసిపోనుంది. అయితే నిషేధాన్ని ఎత్తివేయాలా ? లేక పొడగించాలా అనే విషయం చర్చించడానికి నేడు ఎన్నికల సంఘం సమావేశం కానుంది. 

కోవిడ్-19 (covid -19) వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో ఐదు రాష్ట్రాల్లో జ‌రగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీల‌పై (election rallys) నిషేధాన్ని ఎత్తివేయాలా వద్దా అనే అంశాన్ని నేడు నిర్ణ‌యించనుంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం నేడు స‌మావేశం కానుంది. త‌రువాతా ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పెరుగుతున్న కరోనా కేసుల మధ్య జనవరి 15వ తేదీ వ‌ర‌కు బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలు (road shows), స‌మావేశాల నిషేధిస్తూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (central election commission) జ‌న‌వ‌రి 8వ తేదీన నిర్ణ‌యించింది. అదే రోజు ఉత్తరప్రదేశ్ (uthara pradhesh), ఉత్తరాఖండ్ (utharakhand), గోవా (goa), పంజాబ్ (punjab), మణిపూర్ (manipur) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో.. క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి, స‌మీక్ష జ‌రిపిన త‌రువాత నిషేదాన్ని పొడ‌గించాలా ? వ‌ద్దా అనే నిర్ణ‌యంలో ఈసీ (ec)నిర్ణ‌యం తీసుకోనుంది. 

బహిరంగ స‌భలు, స‌మావేశాలు, రోడ్ షోలు నిషేధించ‌డంతో పాటు ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అనుసరించాల్సిన 16 పాయింట్ల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను (16 points guidelines) కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం (central election commission) జారీ చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం.. ఇంటింటికి ప్రచారానికి వెళ్లే వారిలో అభ్య‌ర్థితో పాటు మ‌రో ఐదుగురు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఓట్ల లెక్కింపు త‌రువాత విజయోత్స‌వ ర్యాలీలు కూడా నిషేధించింది. 

క‌రోనా (corona) కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో మార్పులు తీసుకురావాలని ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. అందులో భాగంగా డిజిట‌ల్ మీడియా (digital media) ద్వారా ప్ర‌చారం చేసుకోవాల‌ని పార్టీల‌కు సూచిస్తోంది. దీని కోసం ప్రసార భారతి కార్పొరేషన్‌తో సంప్రదించి ప్రతీ జాతీయ పార్టీకి కేటాయించిన టెలికాస్ట్ సమయాన్ని (telicast time) రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (uthara pradhesh) శాసనసభ గడువు మే నెలతో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చి నెలలో వివిధ తేదీల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించింది. యూపీలో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కోవిడ్ -19 (covid- 19) కేసులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు.. ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ప్రధాని మోదీని, ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే రాజ్యాంగం ఎన్నిక‌ల సంఘాన్ని క‌ల్పించిన ప‌రిమితుల ఆధారంగా.. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఎన్నిక‌లు నిర్వహిస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.