Asianet News TeluguAsianet News Telugu

కుడుంబశ్రీకి ఏషియానెట్ న్యూస్ టీఎన్‌జీ అవార్డు

ఏషియానెట్ న్యూస్ టీఎన్‌జీ 6వ అవార్డును కుడుంబశ్రీ గెలుచుకుంది. కేరళ కళామండలం చాన్సిలర్ మలల్లికా సారాభాయి చేతుల మీదుగా కుడుంబశ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాఫర్ మాలిక్ ఈ అవార్డును స్వీకరించారు. దివంగత జర్నలిస్టు టీఎన్ గోపకుమార్ స్మారకార్థం ప్రారంభించిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం కేరళలోని త్రిస్సూర్‌లో నిర్వహించారు.
 

Asianet News TNG Award Presented to Kudumbashree by Mallika Sarabhai
Author
First Published Feb 4, 2023, 8:17 PM IST

త్రిస్సూర్: మహిళా సాధికారతకు, స్వయం సమృద్ధత కోసం పని చేస్తున్న ప్రముఖ సంస్థ కుడుంబశ్రీకి ఏషియానెట్ న్యూస్ టీఎన్‌జీ అవార్డు దక్కింది. ప్రముఖ డ్యాన్సర్, కేరళ కళామండలం చాన్సిలర్ మల్లికా సారాభాయి ఏషియానెట్ న్యూస్ టీఎన్‌జీ 6వ అవార్డును కుడుంబశ్రీకి అందజేశారు. ప్రముఖ జర్నలిస్టు, ఏషియానెట్ న్యూస్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్, కీర్తి శేషులు టీఎన్ గోపకుమార్ స్మృతిలో ఈ అవార్డును ప్రారంభించారు. కుడుంబశ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఏఎస్ జాఫర్ మాలిక్ ఈ అవార్డును స్వీకరించారు. 

ఈ అవార్డులో భాగంగా నగదు రూ. 2 లక్షలు, ఒక మెమెంటో, ఒక సర్టిఫికేట్‌ను విజేతలకు అందిస్తారు. మహిళల సాధికారతకు, స్వయం సమృద్ధి కోసం చేసిన కృషికిగాను కుడుంబశ్రీనీ 6వ టీఎన్‌జీ అవార్డుకు ఎంపిక చేశారు. 

అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని కేరళలో త్రిస్సూర్‌‌లోని సాహిత్య అకాడమీ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాగతం పలుకుతూ ఏషియానెట్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కే దాస్ ప్రసంగించారు. ఏషియానెట్ న్యూస్ బిజినెస్ హెడ్ ఫ్రాంక్ పీ థామస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్ బిందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ అసోసియేట్ ఎడిటర్ అనిల్ ఆదూర్ ఈ టీఎన్‌జీ అవార్డు ఎంపిక ప్రక్రియను వివరించారు. రెసిడెంట్ ఎడిటర్ అభిలాష్ జీ నాయర్ ధన్యవాదాలు తెలిపే ప్రసంగం చేశారు.

టీఎన్ గోపకుమార్ జీవితం, కెరీర్‌ను పయాణం అనే డాక్యుమెంటరీ సమగ్రంగా చిత్రించింది. ఈ డాక్యుమెంటరీని కార్యక్రమంలో ప్రదర్శించారు. పయాణం డాక్యుమెంటరీకి ఎంజీ అనీష్ దర్శకత్వం వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios