Ayodhya:అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన  రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ తరుణంలో భక్తులకు రామ మందిర నిర్మాణ కమిటీ మరో శుభవార్త తెలిపింది. భక్తుల సౌకర్యార్థం విమాన సేవలు కూడా ప్రారంభం కానున్నట్టు తెలిపింది.

Ayodhya: కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు జరుగుతాయని రామ మందిర నిర్మాణ కమిటీ వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా భక్తులకు రామ మందిర నిర్మాణ కమిటీ మరో శుభవార్త తెలిపింది. 

 ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రాతో ప్రత్యేకంగా మాట్లాడిన రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అయోధ్యకు తొలి విమాన సర్వీసులు డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇటీవల అయోధ్యను సందర్శించిన పౌర విమానయాన శాఖ అధికారులు డిసెంబర్ నుండి విమానాలు ప్రారంభమవుతాయని ధృవీకరించారనీ, కనీసం మూడు సంస్థలు డిసెంబర్ 2023 నుండి అయోధ్య విమానాలను నడుతాయని తెలిపారు. 

అయోధ్యకు ఎన్ని రైళ్లు వస్తాయని ప్రశ్నించగా.. అయోధ్యలో భక్తుల రద్దీని నిర్ధారించడానికి ప్రత్యేక రైలు సేవలను ప్రభుత్వం ప్రారంభనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రామేశ్వరం,తిరుపతి, ఇతర ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లు వస్తాయి. ఇవన్నీ రద్దీ నిర్వహణపై ప్రభావం చూపుతాయని అన్నారు. రైల్వేకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఆయన క్లుప్తంగా వివరించారు.

ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారని ప్రశ్నించగా.. జనవరి 14-24 తేదీల్లో రామాలయం తలుపులు తెరుచుకోనుండగా...భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారీగా తరలివస్తే భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక హోటళ్లు, ధర్మశాలలు, రెయిన్ బస్రాస్ (నైట్ షెల్టర్లు) లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే.. ఆలయ ప్రారంభోత్సవానికి నగరం సిద్ధంగా ఉందా అని అడిగినప్పుడు మిశ్రా ఇలా సమాధానమిచ్చారు. "అయోధ్య కమిషనర్ ఇటీవల క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అతను చాలా నిశితంగా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందుల కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు " అని అన్నారు. హిందువులందరికీ అయోధ్యను పవిత్ర స్థలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. భక్తులు కోరిన అన్ని ఏర్పాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

నృపేంద్ర మిశ్రాతో వివరణాత్మక ఇంటర్వ్యూ త్వరలో ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడుతుంది.