Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ అలిగిన సచిన్ పైలట్.. హైకమాండ్‌తో అమీతుమీ, రాజస్థాన్‌లో మరో తిరుగుబాటు తప్పదా..?

కాంగ్రెస్‌ సీనియర్ నేత సచిన్‌ పైలట్‌ మరో తిరుగుబాటుకు తెరదీశారా...ఢిల్లీలో ఏం జరుగుతోంది. ఇప్పుడు రాజస్థాన్‌తో పాటు దేశంలోని రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అధిష్ఠానం ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకే సచిన్‌ ఢిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

As Pilot lands in Delhi Congress leaders huddle to resolve Rajasthan crisis ksp
Author
Delhi, First Published Jun 13, 2021, 9:02 PM IST

కాంగ్రెస్‌ సీనియర్ నేత సచిన్‌ పైలట్‌ మరో తిరుగుబాటుకు తెరదీశారా...ఢిల్లీలో ఏం జరుగుతోంది. ఇప్పుడు రాజస్థాన్‌తో పాటు దేశంలోని రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అధిష్ఠానం ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకే సచిన్‌ ఢిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది జులైలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో విభేదించి తిరుగుబాటు చేసిన సచిన్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగించింది. రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

అటు రాష్ట్రంలో పార్టీ అగ్ర నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ విబేధాలు మాత్రం తొలగిపోలేదు. ఏడాది గడుస్తున్నా సచిన్‌కు ఇచ్చిన హామీలను కూడా అధిష్ఠానం నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని కూడా సచిన్ కలుస్తారని టాక్.

కాగా, కాంగ్రెస్‌ నుంచి జితిన్‌ ప్రసాద ఇటీవల బీజేపీలోకి వెళ్లిన నేపథ్యంలో రాజస్థాన్‌లో పార్టీ అంతర్గత విభేదాలపై దృష్టి సారించాలంటూ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని.. అందులో సచిన్‌ అనుచరులకు చోటు దక్కనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు సహా బీఎస్పీ నుంచి ఇటీవల వచ్చిన ఎమ్మెల్యేలతో సీఎం అశోక్‌ గెహ్లాట్ నిరంతరం మంతనాలు జరుపుతున్నారు.

Also Read:బహుశా సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడారేమో.. నాతో కాదు: రీటా వ్యాఖ్యలకు సచిన్ పైలట్ కౌంటర్

కేబినెట్‌లో ప్రస్తుతం 9 ఖాళీలుండగా.. సచిన్‌ వర్గీయులు కాకుండా 18 మంది స్వతంత్రులు కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే తన వర్గానికి రాష్ట్ర కేబినెట్‌లో కనీసం 6-7 మంత్రి పదవులు దక్కాలని సచిన్‌ కోరుతున్నట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ సహా పార్టీ, పలు కమిషన్లలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్టు కాంగ్రెస్‌ రాజస్థాన్‌ ఇంఛార్జి అజయ్‌ మాకెన్‌ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు సచిన్ పైలట్ ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

తమ డిమాండ్లు నెరవేరడానికి సుదీర్ఘ కాలంపాటు వేచి చూడాల్పిరావడంతో తాము సహనం కోల్పోయామని సచిన్‌తో ఆయన మద్ధతుదారులు అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సచిన్‌‌ను వీడిచిపెట్టాలని తమకు సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి ఒత్తిడి వస్తున్నట్టు పలువురు అన్నట్లుగా సమాచారం. అయినప్పటికీ పార్టీలో ఉంటూనే న్యాయమైన తమ హక్కుల కోసం పోరాడతామని పేర్కొన్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios