Asianet News TeluguAsianet News Telugu

దేశ ప్రధాని విద్యావంతుడై ఉండాలి : అరవింద్ కేజ్రీవాల్

ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్ష విమర్శలు

Arvind kejriwal tweet on pm modi

భారత ప్రధాని నరేంద్ర మోదీపై డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరోక్ష విమర్శలకు దిగారు. దేశానికి ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తం విద్యావంతుడై ఉండాలంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అలాంటి ఉన్నత విద్యావంతుడైన మన్మోహన్ సింగ్ ను మనం కోల్పోయామంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇలా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రత్యక్షంగా పొగుడుతూ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా విమర్శించారు.

గతంలోనే ప్రధాని మోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  మోదీ డిగ్రీ సర్టిఫికేట్ నఖిలీవంటూ విమర్శించారు. మరోసారి కేజ్రీవాల్ ప్రధానమంత్రి విద్యావంతుడై ఉండాలని మోదీని ఉద్దేశించే ట్వీట్ చేశాడని బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  

ఇక కేజ్రీవాల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. మన్మోహన్ లాంటి విద్యావంతుడైన ప్రధానిని దేశ ప్రజలు కోల్పోయారని, మళ్లీ అలాంటి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

పతనమవుతున్న రూపాయి విలువ దేశీయ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశంపై ఓ జాతీయ మీడియా కథనాన్ని రాసింది. ఈ నేపథ్యంలోనే, కేజ్రీవాల్ తనదైన శైలిలో మోదీపై సెటైర్లు వేశారు.
 
 అయితే గతంలో ఇదే కేజ్రీవాల్‌ మన్మోహన్ సింగ్ ను విమర్శించిన విషయం తెలిసిందే. మన్మోహన్‌ సింగ్‌ను ధృతరాష్ట్రుడితో పోలుస్తూ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధృతరాష్ట్రుడి వంటి మన్మోహన్‌ సింగ్‌ తన ప్రభుత్వంలోని, కాంగ్రెస్‌ పార్టీలోని అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యారంటూ’ గతంలో కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios