పాకిస్తాన్ నుంచి ఓ డ్రోన్ బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని తెచ్చి భారత భూభాగంలో పడేసింది. అర్ధరాత్రి ఓ డ్రోన్ పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి పంజాబ్‌లోకి వచ్చింది. డ్రోన్ చప్పుడు విని ఆర్మీ సిబ్బంది అనుమానంతో అటువైపుగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడ వెతకగా.. రెండు ప్యాకెట్లు కనిపించాయి. అవి విప్పి చూడగా ఆర్డీఎక్స్, చైనా మేడ్ పిస్టల్, మరికొన్ని ఇతర సామగ్రి లభించాయి.
చండీగడ్: పాకిస్తాన్(Pakistan) మరోసారి దాని వక్రబుద్ధి చూపెట్టుకుంది. మన దేశంలో ఉగ్రవాదాన్ని(Terrorism) ఎగదోయడానికి కుయుక్తులు పన్నుతూనే ఉన్నది. తాజాగా, మరోసారి డ్రోన్(Drone0 ద్వారా మన దేశంలో చిచ్చు పెట్టాలని చూసింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బుధవారం దాదాపు నాలుగు కిలోల ఆర్డీఎక్స్, పిస్టల్, బాంబు తయారీ చేయడానికి అవసరమైన ఇతర పరికరాలను కనుగొన్నారు. వీటిని రెండు పాకెట్‌లుగా గుర్తించారు. పాకిస్తాన్ నుంచి ఇండియా వైపు వచ్చిన ఓ డ్రోన్ పంజాబ్‌లో వీటిని పడేసి వెనక్కి వెళ్లిందని ఆర్మీ(Indian Army) అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి పాకిస్తాన్ నుంచి ఓ డ్రోన్ వచ్చిందని పేర్కొన్నారు. రాత్రి 1 గంటల ప్రాంతంలో ఆకాశంలో చప్పుడు రావడంతో అనుమానంగా పరిశీలించారు. పంజాబ్ సమీపంలోని పాకిస్తాన్ సరిహద్దు గుండా ఈ చప్పుడు వచ్చింది. ఏదో ఎగురుతూ వస్తున్నట్టు మాత్రం గుర్తించారు. దీంతో ట్రూపులు చప్పుడు వస్తున్న వైపుగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత చప్పుడు క్రమంగా క్షీణించిందని తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సెక్టార్‌లో పంజ్‌గ్రెయిన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ తర్వాత జవానులు బుధవారం ఉదయం సెర్చ్ మొదలుపెట్టారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న గగ్గార్, సింఘోక్ గ్రామాల గోధుమ పొలాల్లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలోనే వారు రెండు పసుపు రంగులోని ప్యాకెట్లు గుర్తించారు. అవి రెండు 20 మీటర్ల దూరంలో విడిగా పడి ఉన్నాయి. తొలుత తాము ఆ ప్యాకెట్‌లలో మాదక ద్రవ్యాలు ఉండవచ్చని భావించామని అధికారులు తెలిపారు. కానీ, వాటిని ఓపెన్ చేయగానే ఖంగు తిన్నామని వివరించారు. అందులో సుమారు 4.7 కిలోల ఆర్డీఎక్స్ ఉన్నదని తెలిపారు. అంతేకాదు, చైనాలో తయారైన పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 22 బుల్లెట్లు, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్ డివైజ్, డిటోనేటింగ్ కార్డ్, స్ప్లింటర్లు, సెల్స్, స్టీల్ కంటెయినర్, నైలాన్ దారం, ప్లాస్టిక్ పైప్, ప్యాకింగ్ మెటీరియల్‌తోపాటు ఒక లక్ష రూపాయల నగదు కూడా ఆ ప్యాకెట్ల నుంచి రికవరీ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
పేలుడు పదార్థం ఐఈడీని తయారు చేయడానికి ఆర్డీఎక్స్ అవసరం పడుతుంది. ఈ ఐఈడీని తయారు చేయడానికి అవసరమైన ఆర్డీఎక్స్‌తోపాటు ఇతర పరికరాలు కూడా ఆ పార్సిళ్లలో ఉండటం గమనార్హం. ఆ డ్రోన్ పాకిస్తాన్ డ్రోన్ అని, అక్కడి నుంచి భారత్ వైపు వచ్చిందని వివరించారు. అయితే, కాల్పులు జరపగానే డ్రోన్ రిటర్న్ వెళ్లిపోయిందని తెలిపారు.
పాకిస్తాన్(Pakistan)లో హిందువులు సహా మైనార్టీలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా, ఓ హిందూ వ్యాపార వేత్త(Hindu Businessman)ను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి(Shot Dead) చంపారు. గోట్కీ జిల్లాలోని దహర్కి టౌన్‌లో ఈ సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో నిరసనకారులు కొందరు వీధుల్లోకి వచ్చిన ఆందోళనలు చేశారు. అక్కడి రహదారులపై బైఠాయించారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వెంటనే దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్లను దిగ్బంధించారు. ఈ ఘటన సింధ్ ప్రావిన్స్‌లో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలను పెంచి పోషించే కుట్రలో భాగంగా జరిగిందని స్థానిక నేత ఒకరు తెలిపారు.
