కార్డన్ సెర్చ్‌లు, స్పెషల్ ఆపరేషన్లతో సైన్యం ఉగ్రవాదుల ఏరివేతను ఎంతగా ముమ్మరం చేసినా ముష్కరుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా ఓ ఆర్మీ జవాన్‌ను టెర్రరిస్టులు అపహరించుకుపోయారు.

కార్డన్ సెర్చ్‌లు, స్పెషల్ ఆపరేషన్లతో సైన్యం ఉగ్రవాదుల ఏరివేతను ఎంతగా ముమ్మరం చేసినా ముష్కరుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా ఓ ఆర్మీ జవాన్‌ను టెర్రరిస్టులు అపహరించుకుపోయారు.

బుద్గాం జిల్లా ఖ్వాజిపురా గ్రామానికి చెందిన 27 ఏళ్ల జవానును శుక్రవారం రాత్రి సాయుధులైన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇతనిని మహ్మద్ యాసిన్‌గా గుర్తించారు. యాసిన్ జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ ఫాంట్రీ దళంలో జవానుగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జాక్లీ బ్రిగేడ్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31వ తేదీ వరకు సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. ఆర్మీ జవాన్‌ అపహరణపై సైన్యం దర్యాప్తునకు ఆదేశించింది. సాయుధులైన ముష్కరులు ఫూంచ్ జిల్లా రిజిస్ట్రేషన్ ఉన్న కారులో వచ్చినట్లుగా గుర్తించారు.

కాగా 2017లో లెఫ్టినెంట్ ఉమర్ ఫయ్యాజ్‌ను అపహరించి హతమార్చిన ఉగ్రవాదులు.. ఆ సంఘటన మరచిపోకముందే 2018లో ఔరంగజేబ్ అనే సిపాయిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అత్యంత దారుణంగా అతనని హతమార్చారు. ఈ నేపథ్యంలో కిడ్నాపైన ఆర్మీ జవాన్ కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలింపు జరుపుతున్నాయి.