న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు.

ఏపీ కేబినెట్ పూర్తైన తర్వాత  ఏపీ సీఎం జగన్  విజయవాడ నుండి నేరుగా  ఢిల్లీకి చేరుకొన్నారు.  ఏపీ రాష్ట్రానికి రావాలిసిన నిధులతో పాటు  రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించాలని సీఎం ప్రధానమమంత్రిని కోరనున్నారు. ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ గత నెల 27వ తేదీన తీర్మానం చేసింది.

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించాల్సి ఉంది. ఏపీ శాసనమండలి రద్దు అంశం కూడ మోడీతో జగన్ చర్చించే అవకాశం లేకపోలేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని  మోడీని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది. 

జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు కూడ ఉన్నారు.