Anna Hazare: సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ అమ్మకాలను అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ.. నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి “రిమైండర్” లేఖ రాశారు. వైన్ పాలసీని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న సీఎంకు తొలి లేఖ పంపామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని హజారే పేర్కొన్నారు.
Anna Hazare: మహారాష్ట్రలో వైన్ సేల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. వైన్ సేల్ పాలసీకి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగుతామని బెదిరిస్తూ మహారాష్ట్ర సీఎంకు అన్నా హజారే 'రిమైండర్' లేఖ రాశారు. సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ఈ మేరకు ఫిబ్రవరి 3న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన లేఖ రాశారు. అయితే.. మహారాష్ట్ర సీఎం నుంచి ఎలాంటి స్పందన రాలేదని హజారే పేర్కొన్నారు. దీంతో మరోసారి లేఖ (రిమైండర్ లెటర్) పంపుతున్నాననీ తెలిపారు.
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం.. సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో వైన్ అమ్మకాలను అనుమతించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రానికి దురదృష్టకరమని విమర్శించారు. ప్రజలతో మద్యం మాన్పించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వానిదేననీ, వారిని మద్యానికి బానిసలుగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు ప్రమాదకరమనీ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇదే విషయాన్ని తాను సీఎం, డిప్యూటీ సీఎం (అజిత్ పవార్)కి లేఖ పంపానని, కానీ ఎలాంటి స్పందన రాలేదని హజారే పేర్కొన్నారు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్నా హజారే తీవ్రంగా వ్యతిరేకించారు.
కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. సూపర్ మార్కెట్లు, పెద్ద స్టోర్లలో వైన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దేవాలయాలు, విద్యా సంస్థల వద్ద ఉండే వాటికి ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. మహారాష్ట్రను మద్యపాన రాష్ట్రంగా మారుస్తున్నారంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.
