ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన ఫోటోలను  కూడా ఆయన షేర్ చేసి.. దాని గురించి అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా సార్లు ఆయన అలా చేశారు. కాగా.. ఇటీవల చీమ పెళ్లి పై ఓ వ్యక్తి వేసిన జోక్ ని కూడా తాజాగా మహీంద్రా షేర్ చేశారు. కాగా.. ఆ జోక్ చూసిన తర్వాత ఆయన నవ్వలేక చచ్చిపోయారట. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా వివరించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఓ రోజు ఆనంద్ మహీంద్రాకు ఎందుకో చీమల గురించి చెప్పాలనిపించింది. అప్పుడే ఓ ఆకుపై ఉన్న చీమ ఫొటో షేర్ చేశారు. దానిపై ‘‘ఓ ఒంటరి చీమ 29 ఏళ్ల వరకూ జీవించగలదు’’ అని రాసుంది. 

ఇక్కడి వరకూ బాగానే ఉంది. దీనిలో జోకేమీ లేదు. కానీ దీన్ని అమోల్ భారతే అనే వ్యక్తి జోక్ చేసి పారేశాడు. మహీంద్రా ట్వీట్‌లో ‘ఎ సింగిల్ యాంట్ కెన్ లివ్ టూ బి 29 ఇయర్స్ ఓల్డ్’ అని ఉంది. దాన్నే అమోల్ పట్టుకున్నాడు. ‘మరి పెళ్లయిన చీమ అయితే?’ అని ప్రశ్నించాడు.

సింగిల్ యాంట్ 29 ఏళ్లు జీవిస్తే? పెళ్లయిన దాని సంగతేంటని అమోల్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చూసిన తాను కడుపులో నొప్పి వచ్చేలా నవ్వానని మహీంద్రా వెల్లడించారు. ‘‘అమోల్ భారతే ఈ సమస్య గురించి ప్రశ్నించినప్పుడు నేను నవ్వలేక చచ్చా. ఆ రోజు నవ్వుతుంటే డొక్కల్లో విపరీతంగా నొప్పి కూడా వచ్చింది. అంతలా నవ్వా. ఆ నొప్పి ఇంకా తగ్గలేదు. పెళ్లిలో కష్టాల గురించి నాకు తెలిసిన అద్భుతమైన జోక్స్‌లో ఇదీ ఒకటి’’ అని మహీంద్రా గుర్తుచేసుకున్నారు.  కాగా.. ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.