గంగానదిపై మళ్లీ కూలిన నిర్మాణంలోని వంతెన.. విచారణకు ఆదేశాలు
Patna: గంగానదిపై నిర్మిస్తున్న వంతేన మళ్లీ కూలిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు.
Under-construction bridge on Ganga collapses: గంగానదిపై నిర్మిస్తున్న వంతెన మళ్లీ కూలిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. గంగా నదిపై నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెనలో పెద్ద భాగం కూలిపోవడంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై రోడ్డు నిర్మాణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ అమృత్ తో చర్చించిన ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనీ, నిర్మాణంలో నిమగ్నమైన సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దోషులను వదిలిపెట్టబోమని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
నిర్మాణ సంస్థ 'ఎస్కే సింగ్లా'పై కఠిన చర్యలు తీసుకుంటామనీ, విచారణ పూర్తయిన తర్వాత బ్లాక్ లిస్టులో పెడతామని ప్రత్యాయ అమృత్ స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. సుల్తాన్ పూర్ సబ్ డివిజన్, ఖగారియా జిల్లాల మధ్య నాలుగు వరుసల వంతెనను రూ.1,716 కోట్లతో నిర్మిస్తున్నారు. పిల్లర్ నెంబర్ 5, 6 మధ్య వంతెన సూపర్ స్ట్రక్చర్ కూలిపోయింది. గత ఏడాది ఏప్రిల్ 30న వంతెన కూలిపోయినప్పుడు ఐఐటీ రూర్కీ నిపుణులతో సంప్రదింపులు జరిపామని అధికారులు తెలిపారు. పిల్లర్ నంబర్ 5 మాత్రమే కాకుండా 2, 3, 4లపై కూడా విచారించాలని కోరారు. కేబుల్స్ సపోర్ట్ తో కూడిన కాంక్రీట్ స్ట్రక్చర్ ఆధారంగా బ్రిడ్జి డిజైన్ రూపొందించారు. ఇది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా పలుమార్లు అభివర్ణించిన సంగతి తెలిసిందే.
డిజైనర్ తప్పిదం ఉందని అనుమానం రావడంతో నిర్మాణ సంస్థ 'ఎస్కే సింగ్లా' యజమాని, తన అమెరికన్ డిజైనర్లు నాతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ బ్రిడ్జిలో ఐదు సెగ్మెంట్లు ఉన్నందున వీలైనంత త్వరగా డిజైన్ పూర్తి చేయాలని కోరాం. లోపభూయిష్టమైన డిజైన్ పై ఐఐటీ రూర్కీ కూడా రెండు రోజుల క్రితం తన దర్యాప్తును పూర్తి చేసింది. సమావేశం కూడా నిర్వహించాలని అనుకున్నారని, అయితే వీటన్నింటి మధ్యనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇదిలావుండగా, రోడ్డు నిర్మాణ విభాగం ఇన్చార్జి కూడా అయిన ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. "గత సంవత్సరం కూలిన తరువాత, మేము నిర్మాణంలో కొన్ని పగుళ్లను కనుగొన్నాము. అందుకు అనుగుణంగానే లోపభూయిష్టమైన నిర్మాణాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాం. డిజైన్ లో లోపం ఉందని అనుమానించి మార్పులు చేశాం. నిర్మాణాలపై మాకు ఫిర్యాదులు కూడా అందాయి. ఇప్పటి వరకు ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం అందలేదని" తేజస్వి యాదవ్ తెలిపారు.
కాగా, ఈ నిర్మాణాల్లో పగుళ్లను బీజేపీ శాసనసభ్యుడు సంజీవ్ కుమార్ ఎత్తిచూపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీహార్ విధానసభలో కూడా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు బీహార్ ప్రభుత్వం నిపుణులైన ఇంజినీర్ల బృందాన్ని పంపిందని తెలిపారు. భాగల్ పూర్ లో కూలిన వంతెన కాదని బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా అన్నారు. బీహార్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం గంగానదిలో కలిసిపోయింది. ఈ వంతెన రెండుసార్లు కూలిపోయిందంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టమవుతోందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ రాజీనామా చేయాలన్నారు. ఆయన ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని సామ్రాట్ చౌదరి ఆరోపించారు.