Asianet News TeluguAsianet News Telugu

కేంద్రనిధులను సిండికేట్లకు మళ్లించారు: మమతా బెనర్జీపై అమిత్ షా ఆరోపణలు

మమతా బెనర్జీ సర్కార్ కేంద్ర నిధులను దుర్వినియోగం చేసిందంటూ ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సిండికేట్లకు మళ్లించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్లలో సిండికేట్లకు రూ.4,24,800  కోట్లను ఇచ్చిందన్నారు.   
 

amith shah comments on west bengal cm mmata benerji
Author
West Bengal, First Published May 7, 2019, 2:31 PM IST

పశ్చిమబంగ: బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, మమతా బెనర్జీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ముగియకముందే కమలదళపతి అమిత్ షా స్వరం పెంచారు. 

ఈసారి మమతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ సర్కార్ కేంద్ర నిధులను దుర్వినియోగం చేసిందంటూ ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సిండికేట్లకు మళ్లించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్లలో సిండికేట్లకు రూ.4,24,800  కోట్లను ఇచ్చిందన్నారు.   

ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీపై మమతా బెనర్జీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పీఠం నుంచి దిగిపోయే వ్యక్తితో తనకు మాటేమిటంటూ వ్యాఖ్యానించారు. తాను తుఫాన్ పర్యవేక్షణ పనుల్లో ఉన్నానని అలాంటి సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసి ఉండకపోవచ్చన్నారు. దానిపై ప్రధాని మాట్లాడటం దురదృష్టకరమంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన విషక్ష్ం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios