కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ జరిగే ఒక రోజు ముందు శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం నాడు ఫోన్ చేశారు.అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కోరారు. 


న్యూఢిల్లీ:కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ జరిగే ఒక రోజు ముందు శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం నాడు ఫోన్ చేశారు.అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కోరారు. 

జూలై 20వ తేదీన లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగనుంది. అవిశ్వాసంపై ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన మద్దతును బీజేపీ కోరింది. అయితే ఈ విషయమై శివసేన చీఫ్ మాత్రం తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయలేదు.

24 గంటలు ఆగితే తమ పార్టీ వైఖరిని తేలనుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. లోక్‌సభలో తమ పార్టీ వైఖరి తేటతెల్లంకానుందన్నారు.సుదీర్ఘకాలం పాటు మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య పొత్తు తెగతెంపులు చేసుకొంది. ఎన్డీఏలో శివసేన భాగస్వామిగా ఉంది. కానీ, బీజేపీ తీరుపై ఆ పార్టీ తీవ్రంగా అసంతృప్తితో ఉంది.

ప్రతిపక్షాల గొంతును విన్పించాల్సిన అవసరం ఉందని శివసేన అభిప్రాయపడింది. అవిశ్వాసంపై చర్చలో పాల్గొంటామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఓటింగ్ జరిగితే ఏం చేస్తామనేది ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు.