కరోనా ఎఫెక్ట్: మార్చి 31 వరకు బార్లు, దుకాణాలు సహా అన్నీ మూత
కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. లక్నోలో అన్ని రెస్టారెంట్లు, దుకాణాలను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లక్నో:కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. లక్నోలో అన్ని రెస్టారెంట్లు, దుకాణాలను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వ్యాది వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. దుకాణాలు తెరిచి ఉంచడం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా షట్ ఇన్ లక్నోకు ఆదేశాలు జారీ చేసినట్టుగా నిర్ణయం తీసుకొంది సర్కార్.
లక్నోలో బార్లు, రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు,దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం నాడు జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా అభిషేక్ ప్రకటించారు.అయితే ఈ నిబంధనలను వ్యతిరేకించిన వారిని శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.