కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు మన సైనికులపై దాడులు చేసే వారని, అయినా అప్పటి ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా నేడు కౌంటర్ ఇచ్చారు.
మన్మోహన్ సింగ్ (manmohan singh) ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో బయటి వ్యక్తులు మన సైనికులపై దాడి చేసేవారని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అమిత్ షా (amith shah) అన్నారు. ఇటీవల పంజాబ్ (punjab)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీ (bjp)ని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో అమిత్ షా శనివారం స్పందించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
రాయ్ బరేలిలో (raebareli) ఓ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. దేశంలో పదేళ్లుగా సోనియా-మన్మోహన్ సింగ్ (sonia gandhi-manmohan singh) ప్రభుత్వం కొనసాగిందని, ఆ సమయంలో తరచూగా ఈ అలియా (alia), మాలియా (malia), జమాలియా (jamalia)భారత్‌లోకి ప్రవేశించి భారత సైనికులను పొట్టన పెట్టుకునేవారని ఆరోపించారు. అయినా ఆ సమయంలో దేశ ప్రధాని ఏం చేయలేదని విమర్శించారు. ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ (utharpradesh) లో జరిగిన మరో ర్యాలీలో హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ దేశానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు పాకిస్తాన్ భారత్‌పై దండయాత్ర చేసి జవాన్ల తలలు నరికింది అని ఆయన ఆరోపించారు. ‘‘ అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమీ చేయలేదు. కానీ ఉరీ, పుల్వామా దాడుల తర్వాత ప్రధాని మోడీ (prime minister modi) 10 రోజుల్లోనే సర్జికల్ స్ట్రైక్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను అంతమొందించారు’’ అని షా అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదు రోజుల కిందట పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ (bjp) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఏడేళ్లకు పైగా అధికారంలో ఉందని అన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఎదురయ్యే ప్రతీ సమస్యకు ఇప్పటికీ జవహర్ లాల్ నెహ్రూనే నిందిస్తున్నారని తెలిపారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చరిత్రను వక్రీకరించవద్దని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంగ్లేయులు అవలంబించిన విభజించు పాలించు అనే పాలనా విధానాన్ని పాటిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రజలను విభజించే వ్యాఖ్యలు, విధానాలు అవలంబించలేదని అన్నారు.
ఒక వైపు ప్రజలు దేశ ప్రజలకు పెరిగిన ధరలు, నిరుద్యోగంతో బాధపడుతుంటే.. మరో వైపు ప్రస్తుత ప్రభుత్వం వారి పొరపాట్లను గుర్తించి.. సరిదిద్దుకోకుండా భారత తొలి ప్రధానిని నిందించడం సరికాదని మాజీ ప్రధాని అన్నారు. విదేశాంగ విధానం విషయంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు క్షీణిస్తున్నాయని చెప్పారు. పాత మిత్రులు భారతదేశాన్ని దూరంగా ఉంచుతున్నాయని చెప్పారు. నాయకులను బలవంతంగా కౌగిలించుకోవడం, వారితో ఊగిసలాటలు చేయడం వల్ల, పిలవని బిర్యానీలకు వెళ్లడం వల్ల దేశాల దేశాల సంబంధాలు మెరుగుపడవని ఇప్పటి పాలకవర్గం పాలకవర్గం అర్థం చేసుకుంటుందని తాను ఆశిస్తున్నాని అన్నారు.
అయితే మాజీ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (niramla sitharaman)తో సహా పలువురు మన్మోహన్ సింగ్ ను విమర్శించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలన కారణంగా ఆర్థిక వ్యవస్థ గురించి అకస్మాత్తుగా మాట్లాడుతున్నారా అని సీతారామన్ ప్రశ్నించారు. ‘‘ మీ (సింగ్) పై నాకు చాలా గౌరవం ఉంది. మీ నుంచి నేను ఇది ఊహించలేదు. ఇది విని నేను చాలా బాధపడ్డాను ’’ అని ఆమె అన్నారు.
