Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ వాయిదా: ఆంతర్యం ఇదే

సమాజ్ వాదీపార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ షాక్ ఇవ్వనున్నారా..?కేసీఆర్ తో అర్థాంతరంగా ఆపెయ్యడానికి కారణం ఏంటి..?ఫెడరల్ ఫ్రంట్ కు సై కొట్టాలో బీజేపీయేతర ఫ్రంట్ కు జై కొట్టాలో తెలియక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? కేసీఆర్ తో భేటీకి అఖిలేష్ యాదవ్ డుమ్మాకొట్టడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Akhilesh Yadav meeting with KCR postponed
Author
Delhi, First Published Dec 26, 2018, 4:50 PM IST

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాదీపార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ షాక్ ఇవ్వనున్నారా..?కేసీఆర్ తో అర్థాంతరంగా ఆపెయ్యడానికి కారణం ఏంటి..?ఫెడరల్ ఫ్రంట్ కు సై కొట్టాలో బీజేపీయేతర ఫ్రంట్ కు జై కొట్టాలో తెలియక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? కేసీఆర్ తో భేటీకి అఖిలేష్ యాదవ్ డుమ్మాకొట్టడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన కేంద్రంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కోరుతూ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా పలువురితో భేటీ అయ్యారు. 

అయితే సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ భేటీని అఖిలేష్ యాదవ్ అర్థాంతరంగా రద్దు చేశారు. తాను త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని చెప్పుకొచ్చారు. 

కొన్ని అనివార్య కారణాల వల్ల బుధవారం కేసీఆర్ ను కలవలేకపోతున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని అఖిలేష్ యాదవ్ కొనియాడారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం గత కొన్ని నెలల నుంచి కేసీఆర్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.  

త్వరలోనే తాను హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ ను కలుస్తానని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. జనవరి 6 తర్వాత సీఎం కేసీఆర్ ను అఖిలేష్ యాదవ్ కలిసే అవకాశం ఉంది. అయితే వ్యూహాత్మకంగానే అఖిలేష్ యాదవ్ కేసీఆర్ తో భేటీకి డుమ్మా కొట్టారన్న ప్రచారం జరగుతుంది. 

అఖిలేష యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలు ఫెడరల్ ఫ్రంట్ కు కానీ బీజేపీయేతర ఫ్రంట్ కు కానీ మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ముగ్గురు సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టిసారించినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం ఏ ఫ్రంట్ కుమద్దతు ఇవ్వాలో నిర్ణయించనున్నారు. 

అయితే బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కడా అఖిలేష్ యాదవ్ స్పష్టం చెయ్యడం లేదు. అంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ కూటమికి జై కొట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే బీజేపీ యేతర కూటమికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించడాన్ని ఈ ముగ్గురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ లేదా జాతీయ పార్టీ నాయకలు ప్రాతినిథ్యం వహిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని సమాచారం. 

మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లు బీజేపీ యేతర కూటమిలో చంద్రబాబు నాయుడు ముందుకు రావడాన్ని తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగానే ఈ ముగ్గురు నేతలు అటు బీజేపీ యేతర కూటమికి కానీ ఫెడరల్ ఫ్రంట్ కు కానీ ఎలాంటి మద్దతు ప్రకటించకుండా గోప్యాన్ని పాటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios