ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. గురువారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన అజయ్ మాకెన్.. ఆ తర్వాత తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

‘‘2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాను.  ఈ నాలుగేళ్లు రాహుల్ గాంధీ, పార్టీ కార్యకర్తలు, మీడియా నుంచి వెలకట్టలేని ప్రేమ, మద్దతు పొందాను’’ అంటూ మాకెన్ ట్వీట్ చేశారు.

మాకెన్ రాజీనామాను రాహుల్ గాంధీ ఆమోదించారు. ఆయన స్థానంలో పార్టీకి చెందిన మరో సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీకి ఆ బాధ్యతలు అప్పగించారు.  వ్యక్తిగత, అనారోగ్య సమస్యల కారణంగా మాకెన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకే మాకెన్ రాజీనామా చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి.