దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం పాత్రపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దర్యాప్తు సంస్ధలు విచారణ చేపట్టాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భారత్‌తో పాటు యూకే, స్పెయిన్‌లలో కార్తీకి చెందని రూ.54 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

ఐఎన్ఎక్స్ ‌మీడియా కేసులో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతులు ఇప్పించడం కోసం అవినీతికి పాల్పడ్డారని కార్తీపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్ధిక మంత్రిగా పనిచేస్తున్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కార్తీ పెట్టుబడుల వ్యవహారాన్ని ప్రభావితం చేశారనీ ఈడీ ఛార్జీ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కార్తీతో పాటు చిదంబరాన్ని నిందితులుగా చేర్చింది.

అయితే అరెస్ట్ నుంచి వీరిని మినహాయిస్తూ కోర్టు గతంలో మే 6 వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగిసిపోవడంతో మరోసారి తమ గడువును పొడిగించాల్సిందిగా చిదంబరం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే చిదంబరం దర్యాప్తునకు సహకరించడం లేదని ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వాదిస్తూ.. ఆయన్ను కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు సంస్ధలు న్యాయస్థానాన్ని కోరుతున్నాయి.