న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్  తన 88వ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఐఎఎఫ్ సోమవారం నాడు  తన ప్రయాణానికి సంబంధించి గుర్తులను  ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.అత్యాధునికి క్షిపణులు , మందుగుండు సామాగ్రి, పోరాట విమానాలు హెలికాప్టర్ల విభిన్న ఆయుధాలను ప్రదర్శిస్తున్నట్టుగా ఆ వీడియోలో ప్రదర్శించారు.

 

ఈ నెల 8వ తేదీన ఐఎఎఫ్ రెండు రాఫెల్ యుద్ద విమానాలతో పాటు రుద్ర, చింకూ, ఏకలవ్య, అపాచీ, సీ 130 జే, మిగ్ 29 ఎస్, బైసన్, ఎస్ 30 ఎంకేఐ, మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను ప్రదర్శించనున్నారు.

హిందన్ వైమానిక దళం స్టేషన్ లో ఈ ప్రదర్శన జరగనుంది. ఇందులో 56 విమానాలు తమ శక్తిని చూపిస్తాయి. 19 యుద్ధ విమానాలు, 19 హెలికాప్టర్లు, 7 రవాణా విమానాలు పాల్గొంటాయి.భారత వైమానిక దళం ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటని  ఎయిర్ ఛీఫ్ మార్షల్  ఆర్ కె ఎస్ భదౌరియా చెప్పారు.

దేశంలోకి వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు చురుకుగా పనిచేస్తున్నాయని  ఆయన వివరించారు. మరో ఐదు రాఫెల్ విమానాలు మరో నాలుగు మాసాల్లో రానున్నాయని ఆయన చెప్పారు. 2023 నాటికి రాఫెల్ విమానాలు రానున్నాయని ఆయన వివరించారు.

పిఎల్ఏను తక్కువ అంచనా వేసే ప్రశ్నే లేదని ఆయన చెప్పారు.ఎల్ఓసీ ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఐఏఎఫ్ అన్ని రంగాల్లో అప్ గ్రేడ్ అవుతోందన్నారు. ఎఎన్ 32 , ఎంఐ17 కూడ అప్ గ్రేడ్ అవుతోందని ఆయన చెప్పారు.450కి పైగా వేర్వేరు విమానాలను తయారు చేస్తున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి సిద్దంగా ఉంటుందని ఆయన వివరించారు.