Asianet News TeluguAsianet News Telugu

ఎయిమ్స్ మహిళా వైద్యురాలిపై సహోద్యోగి అత్యాచారం.. కేసు నమోదు..!

ఆ తర్వాత..  అక్కడే ఆమె గదిలోకి వెళ్లింది. అయితే.. ఆమె గదిలోకి సహోద్యోగి బలవంతంగా గదిలోకి ప్రవేశించాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

AIIMS Doctor Accuses Senior Colleague Of Raping Her, Case Filed: Police
Author
Hyderabad, First Published Oct 16, 2021, 11:01 AM IST

ఎయిమ్స్( AIIMS) మహిళా వైద్యురాలిపై  సహోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  ఆమె పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. ఆమె సహోద్యోగి అని ఆమె తెలపడం గమనార్హం. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఇటీవల తమ సహోద్యోగి  ఒకరు పుట్టిన రోజు జరపుకున్నారు. అక్టోబర్ 11వ తేదీన పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుండగా.. దానికి బాధితురాలు వెళ్లింది. అయితే.. ఆ పుట్టిన రోజువేడుకల్లో బాధితురాలు మద్యం సేవించింది.

ఆ తర్వాత..  అక్కడే ఆమె గదిలోకి వెళ్లింది. అయితే.. ఆమె గదిలోకి సహోద్యోగి బలవంతంగా గదిలోకి ప్రవేశించాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read: కరుడు కట్టిన రౌడీ షీటర్ దురై మురగన్ ఎన్ కౌంటర్

కాగా..  బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి అప్పటికే వివాహమైందని తెలుస్తోంది. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడిపై  ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం..  sections 376 (Punishment for rape) and 377 (Unnatural offences) కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకులాట కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. 

Also Read: దుర్గా మాత నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

"విచారణ సమయంలో, బాధితురాలు స్టేట్మెంట్ సెక్షన్ 164 CrPC కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. నిందితుడు ఎక్కడ దాక్కొనే అవకాశం ఉందో.. ఆ ప్రదేశాల్లో వెతుకుతున్నట్లు పోలీసులు చెప్పారు. .

Follow Us:
Download App:
  • android
  • ios