Asianet News TeluguAsianet News Telugu

సమయం లేదు మిత్రమా, మా తలుపులు తెరిచే ఉన్నాయి: కేజ్రీవాల్ కు రాహుల్ ఆఫర్

కానీ మిస్టర్ కేజ్రీవాల్ మరో యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పటికీ మేం పొత్తుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ సమయం మించిపోతుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

aicc president rahul gtandhi tweet to kejriwal on alliance
Author
Delhi, First Published Apr 15, 2019, 9:01 PM IST

ఢిల్లీ: దేశరాజధాని హస్తినలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మి పార్టీల మధ్య పొత్తు ఓ కొలిక్కిరావడం లేదు. ఢిల్లీ పార్లమెంట్ స్థానాల విషయంలో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. దీంతో ఇద్దరి మధ్య పొత్తు చెడింది. దీంతో ఢిల్లీలో తమది ఒంటరిపోరేనని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 

అటు ఆప్ సైతం తమది కూడా ఒంటరిపోరేనని తేల్చి చెప్పేసింది. ఇరుపార్టీలు ఎన్నికల ప్రచారం కూడా హోరెత్తించాయి. ప్రచారం హోరెత్తిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఆప్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవాలని ఎన్డీయేతర పార్టీలన్నీ కోరాయి. 

దీంతో పొత్తుకు ప్రయత్నించినప్పటికీ బెడసికొట్టింది. దీంతో ఆప్ 7 లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య పొత్తు బీజేపీ జాడ లేకుండా చేస్తుంది. అందుకోసం కాంగ్రెస్‌ నాలుగు స్థానాలను ఆప్‌కోసం వదులుకోడానికి సిద్ధంగా ఉంది. 

కానీ మిస్టర్ కేజ్రీవాల్ మరో యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పటికీ మేం పొత్తుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ సమయం మించిపోతుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ యూటర్న్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. 

మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశం మీ ట్వీట్‌లో కనిపించడం లేదు. ఇది కేవలం నమ్మించడానికే మాత్రమే. మోదీ-షాల నుంచి దేశాన్ని కాపాడటం చాలా అవసరం. కానీ మీరు ప్రతిపక్షాల ఓటు బ్యాంకును చీల్చి యూపీ, ఇతర రాష్ట్రాల్లో వారికి సహకరిస్తున్నారు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్. 

 

Follow Us:
Download App:
  • android
  • ios