Asianet News TeluguAsianet News Telugu

ఎండకు తట్టుకోలేక.. కాస్ట్‌లీ కారుకి ఆవు పేడ అలికి..!!

భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతోంది. ఏ మూల చూసినా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే జనం వణికిపోతున్నారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు.

ahmedabad woman coats car with cow dung for cool temperature
Author
Ahmedabad, First Published May 22, 2019, 1:54 PM IST

భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతోంది. ఏ మూల చూసినా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే జనం వణికిపోతున్నారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు.

ఈ క్రమంలో ఓ మహిళా ఏకంగా కారుకి పేడ పూత పూసింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ  తన ఖరీదైన కారు మొత్తానికి ఆవు పేడ పూసింది. అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో మినహా మిగిలిన భాగం మొత్తం ఆవు పేడ అలికింది.

దీనికి సంబంధించిన ఫోటోలను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, నగరంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సదరు మహిళ ఈ పని చేసినట్లు ఆ వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపాడు. ఈ కారు యజమాని పేరు సేజల్ షా అని పేర్కొన్నాడు.

అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు నచ్చినట్లుగా కామెంట్లు పెడుతున్నారు. ఈమె ఆవు పేడను సరైన పద్ధతిలో ఉపయోగించారని, తెలివైన వారని కొందరు అంటుంటే, మరికొంతమంది మాత్రం వెక్కిరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios